Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబైలో డేరా బాబా‌కు లగ్జరీ గెస్ట‌హౌస్‌లు.. హనీప్రీత్‌తో కలిసి ఎంజాయ్

వివాదాస్పద గురువు డేరా బాబా అలియాస్ గుర్మీత్ రాం రహీం సింగ్‌కు దేశ రాజధాని ముంబైలో నాలుగు అతిథి గృహాలు ఉన్నాయి. ఇక్కడ తన దత్తపుత్రికగా చెపుకునే హనీప్రీత్‌తో కలిసి ఎంజాయ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Advertiesment
ముంబైలో డేరా బాబా‌కు లగ్జరీ గెస్ట‌హౌస్‌లు.. హనీప్రీత్‌తో కలిసి ఎంజాయ్
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (10:44 IST)
వివాదాస్పద గురువు డేరా బాబా అలియాస్ గుర్మీత్ రాం రహీం సింగ్‌కు దేశ రాజధాని ముంబైలో నాలుగు అతిథి గృహాలు ఉన్నాయి. ఇక్కడ తన దత్తపుత్రికగా చెపుకునే హనీప్రీత్‌తో కలిసి ఎంజాయ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇద్దరు సాథ్వీలపై అత్యాచారం జరిపిన రేపిస్టు గుర్మిత్ రామ్‌రహీం సింగ్‌కు 20 యేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెల్సిందే. ఈయన జైలుకెళ్లిన తర్వాత డేరా బాబా లీలలు కుప్పలుతెప్పలుగా వెలుగులోకి వస్తున్నాయి. 
 
డేరాబాబాకు సిర్సాలోని సచ్చా సౌధాలోనే కాకుండా దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంలోనూ నాలుగు అతిథి గృహాలున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబైలో సంపన్నులు నివాసముంటున్న బాంద్రా, జుహు, రివేరాలో డేరా బాబా ఈ అతిథి గృహం ఏర్పాటు చేసుకున్నాడని సమాచారం. 
 
ఈ ఏడాది అరెస్టుకు ముందు డేరాబాబా మూడు సార్లు తన దత్తపుత్రిక, సహచరి అయిన హనీప్రీత్‌తో కలిసి ముంబైకు వచ్చి ఇక్కడి విలాసవంతమైన అతిథిగృహాల్లో మకాం వేశాడని స్థానికులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిండు గర్భణికి ఆపరేషన్ చేస్తూ.. కత్తెరను పొట్టలో పెట్టి మరిచిపోయిన వైద్యులు