Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం అరెస్ట్… పోలీస్ ఠాణాలో సిసోదియా

ఢిల్లీ: ఢిల్లీలో రాజకీయ కలకలం రేగింది. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోదియాలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సాధార‌ణంగా ఏ రాష్ట్రంలో అయినా డిప్యూటీ సీఎంను పోలీస్ స్టేష‌నుకు తీ

Advertiesment
Deputy chief minister Manish Sisodia
, బుధవారం, 2 నవంబరు 2016 (20:13 IST)
ఢిల్లీ: ఢిల్లీలో రాజకీయ కలకలం రేగింది. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోదియాలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సాధార‌ణంగా ఏ రాష్ట్రంలో అయినా డిప్యూటీ సీఎంను పోలీస్ స్టేష‌నుకు తీసుకువ‌చ్చి కూర్చోపెట్టే ద‌మ్ము డిపార్టుమెంటుకు ఉందా? అది ఒక్క ఢిల్లీలోనే చెల్లింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోదియాను పోలీసులు అరెస్టు చేసి వ్యానుపై తీసుకెళ్లి… ఠాణాలో కూర్చోపెట్టారు. ఆయ‌న చేసిన త‌ప్పు ఏంటంటే… ఓఆర్‌ఓపి కోసం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన రిటైర్డ్ ఆర్మీ అధికారి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు ఆసుప‌త్రిక వెళ్ల‌డం. 
 
అవును స్థానికంగా అధికారం ఆప్ ది అయినా, నెత్తిపైన కేంద్ర బీజేపీ ఉండ‌టంతో పోలీసుల ప‌వ‌ర్ పెరిగిపోయింది. చ‌క్క‌గా ఉప ముఖ్య‌మంత్రిని అరెస్టు చేసి తెచ్చి స్టేష‌న్లో కూర్చోపెట్టేశారు. ఆ తర్వాత ఢిల్లీ సీఎంను కూడా అరెస్టు చేయడంతో కలకలం రేగింది. ఈ సంఘ‌ట‌న‌పై ఆప్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నేత‌లు పోతిన వెంక‌ట రామారావు, హ‌ర్ మొహింద‌ర్ సింగ్ స‌హాని, కంభంపాటి కృష్ణ‌మూర్తి, త‌దిత‌రులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం, పోలీస్ యంత్రాంగం సీఎం కేజ్రీవాల్‌కు, డిప్యూటీ సీఎంకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి బిజీగా ఉన్నారు... టిడిపిలో చేరకపోవచ్చేమో... దిగ్విజయ్ వ్యాఖ్య