Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవి బిజీగా ఉన్నారు... టిడిపిలో చేరకపోవచ్చేమో... దిగ్విజయ్ వ్యాఖ్య

మెగాస్టార్‌, కాంగ్రెస్‌ పార్టీ ఎంపి చిరంజీవి డిసెంబర్‌ 5వ తేదీ తెలుగుదేశం పార్టీలో చేరుతారని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పందించారు. చిరంజీవి ప్రస్తుతం తన 150వ సినిమా ఘాటింగ్‌లో బిజీగా ఉన్నారని, బహుశ

చిరంజీవి బిజీగా ఉన్నారు... టిడిపిలో చేరకపోవచ్చేమో... దిగ్విజయ్ వ్యాఖ్య
, బుధవారం, 2 నవంబరు 2016 (19:49 IST)
మెగాస్టార్‌, కాంగ్రెస్‌ పార్టీ ఎంపి చిరంజీవి డిసెంబర్‌ 5వ తేదీ తెలుగుదేశం పార్టీలో చేరుతారని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పందించారు. చిరంజీవి ప్రస్తుతం తన 150వ సినిమా ఘాటింగ్‌లో బిజీగా ఉన్నారని, బహుశా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరకపోవచ్చునేమోనని చెప్పుకొచ్చారాయన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిగ్విజయ్‌ సింగ్‌ తిరుపతిలోని మాజీ ఎంపి చింతా మోహన్‌ ఇంటిలో మీడియాతో మాట్లాడారు. చిరంజీవిపై ప్రశ్నలు వేయగానే దిగ్విజయ్‌ సింగ్‌ కొద్దిసేపు ఆలోచనలో పడ్డారు.
 
ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం మారడం ఖాయమని జోస్యం చెప్పారు దిగ్విజయ్‌ సింగ్‌. ఆ రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమన్నారాయన. రాష్ట్ర విభజనలో సిపిఎం తప్ప మిగిలిన అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని, అందరి కంటే ఆఖరున కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పారు.
 
పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, కానీ కేంద్రం ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పారు. వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాపై మాట్లాడి చివరకు ప్యాకేజీ ఇస్తామని ప్రకటించడం దారుణమన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జిల్లాలో కీచక పోలీస్‌... పెళ్లి చేసుకుంటానని యువతితో సహజీవనం