Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిత్తూరు జిల్లాలో కీచక పోలీస్‌... పెళ్లి చేసుకుంటానని యువతితో సహజీవనం

రక్షించాల్సిన పోలీసులే మోసానికి పాల్పడుతున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక ఎస్‌ఐ తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది యువతి. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. చౌడేపల్లి మండలం దిగువపల్లికి చెందిన బోయకొండ గంగాప

Advertiesment
chittore crime
, బుధవారం, 2 నవంబరు 2016 (19:29 IST)
రక్షించాల్సిన పోలీసులే మోసానికి పాల్పడుతున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక ఎస్‌ఐ తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది యువతి. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. చౌడేపల్లి మండలం దిగువపల్లికి చెందిన బోయకొండ గంగాపురంలోని శ్రీనివాసుల నాయుడు కుమార్తె అరుణకు పలమనేరు డిఎస్పీ కార్యాలయంలో ఎస్‌ఐగా పనిచేస్తున్న సునీల్‌ కుమార్‌ రెడ్డికి పరిచయమైంది.
 
అరుణకు చెందిన భూమి తగాదాలో ఇద్దరికి పరిచయం ఏర్పడగా తాను సాయం చేస్తానని సునీల్‌ కుమార్‌ రెడ్డి నమ్మబలికాడు. అరుణతో ఏర్పడిన పరిచయంతో ఇద్దరు శారీరకంగా ఒక్కటయ్యారు. అయితే సునీల్‌ కుమార్‌ రెడ్డిని చిత్తూరు రిజర్వ్‌కు కొన్ని రోజుల నుంచి బదిలీ చేశారు. తాను ఇళ్ళు కడుతున్నానని 10 లక్షలు అవసరమని చెప్పి అరుణ నుంచి తీసుకున్నాడు సునీల్‌ కుమార్‌ రెడ్డి. 
 
పెళ్ళి చేసుకోమంటే కోరగా తనను వేరే పెళ్ళి చేసుకోమని సునీల్‌ కుమార్‌ రెడ్డి చెబుతున్నాడని పలమనేరు డిఎస్పీని ఆశ్రయించింది అరుణ. తనకు న్యాయం చేయాలంటూ కన్నీంటి పర్యాంతమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లో కూర్చొని ప్రభుత్వ సేవలను పొందండి ఇలా…