Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇవి బుర్రన్న నిర్ణయాలేనా...? నా డబ్బుతో నా కూతురు వివాహానికి నిబంధనలా... ఓ తండ్రి ఆగ్రహం...

పెద్ద నోట్లు రద్దు వరకూ నిర్ణయం బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఆర్బీఐ విధిస్తున్న నిబంధనలే సామాన్యులకు అరికాలి మంట నెత్తికెక్కుతోంది. వారానికి రూ. 10 వేలు, నెలకు రూ. 25 వేలు అంటూ సన్నాయి నొక్కులు నొక్కిన ఆర్బీఐ వివాహం చేసుకోవాలంటే తగిన ఆధారాలు చూపించాలంటూ క

ఇవి బుర్రన్న నిర్ణయాలేనా...? నా డబ్బుతో నా కూతురు వివాహానికి నిబంధనలా... ఓ తండ్రి ఆగ్రహం...
, గురువారం, 24 నవంబరు 2016 (19:11 IST)
పెద్ద నోట్లు రద్దు వరకూ నిర్ణయం బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఆర్బీఐ విధిస్తున్న నిబంధనలే సామాన్యులకు అరికాలి మంట నెత్తికెక్కుతోంది. వారానికి రూ. 10 వేలు, నెలకు రూ. 25 వేలు అంటూ సన్నాయి నొక్కులు నొక్కిన ఆర్బీఐ వివాహం చేసుకోవాలంటే తగిన ఆధారాలు చూపించాలంటూ కండిషన్ పెట్టింది. ఈ నిబంధనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐనా కష్టించి పనిచేసి బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న మొత్తం ఎప్పుడంటే అప్పుడు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు లేకుండా ఇలాంటి బుర్ర తక్కువ నిబంధనలేమిటి అంటూ ఓ తండ్రి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. 
 
వంసత్ కుంజ్ అనే వ్యక్తి ఢిల్లీలో సుమారు 3 గంటల పాటు క్యూలో నిలబడి బ్యాంకు కౌంటరుకు చేరుకున్నాడు. తన కుమార్తె పెళ్లికి అవసరమైన రూ. 2.5 లక్షలు డ్రా చేసుకునేందుకు వచ్చినట్లు కొన్ని ఆధారాలు చూపించాడు. ఐతే అవి సరిపోవనీ, ఇంకా మిగిలినవి కూడా తీసుకురానిదే డబ్బు ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంకు సిబ్బంది తెగేసి చెప్పింది. దీనితో అతడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆర్బీఐ పెట్టిన నిబంధనలు బుర్రతక్కువతో ఉన్నాయని మండిపడ్డారు. 
 
పెళ్లి చేయకుండా రశీదులు ఎలా వస్తాయి అని ప్రశ్నించారు. పెళ్లి చేసేందుకు చేతిలో డబ్బు ఉంటేనే కదా రశీదులను అడగటానికి.. అయినా పెళ్లి చేసేటపుడు డబ్బు మంచినీళ్లలా ఖర్చయిపోతుంది. వాహనాలకు, పూజారికి ఇచ్చే సంభావన, ఇంకా పెళ్లిలో చేదోడువాదోడుగా ఉండేవారికి ఇచ్చే డబ్బు... ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. అలాంటివాటికి రశీదులు ఎలా వస్తాయో ఆలోచన చేశారా అని నిలదీశారు. ఆయన వాదనతో క్యూలో నిలబడి ఉన్న మిగిలినవారు కూడా మద్దతు తెలిపారు. తక్షణమే తమకు రూ. 2.5 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఐనా తాము కష్టపడి ఆర్జించిన డబ్బును తీసుకునేందుకు మీ కండిషన్లు ఏమిటని పలువురు గట్టిగా మాట్లాడారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టోక్యో నగర వాసులను 40 రోజుల కంటే ముందే పలకరించిన మంచు.. 54ఏళ్ల తర్వాత కొత్త రికార్డు..