Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టోక్యో నగర వాసులను 40 రోజుల కంటే ముందే పలకరించిన మంచు.. 54ఏళ్ల తర్వాత కొత్త రికార్డు..

టోక్యో నగర వాసులను 40 రోజుల కంటే ముందు మంచు పలకరించింది. తద్వారా కొత్త రికార్డు నమోదైంది. జపాన్ రాజధాని నగరమైన టోక్యోలో గురువారం నుంచి మంచు కురవడం ప్రారంభమైంది. తద్వారా గత 54 ఏళ్లలో నవంబర్‌ స్నోఫాల్‌

Advertiesment
Tokyo area gets first November dusting of snow in 54 years
, గురువారం, 24 నవంబరు 2016 (17:38 IST)
టోక్యో నగర వాసులను 40 రోజుల కంటే ముందు మంచు పలకరించింది. తద్వారా కొత్త రికార్డు నమోదైంది. జపాన్ రాజధాని నగరమైన టోక్యోలో గురువారం నుంచి మంచు కురవడం ప్రారంభమైంది. తద్వారా గత 54 ఏళ్లలో నవంబర్‌ స్నోఫాల్‌ ఇదే తొలిసారి అని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. సాధారణంగా చలికాలం మధ్యలో కాంటో, కోషిన్‌ పర్వత ప్రాంతాల్లో మంచు అధికంగా కురుస్తుంది. 
 
కానీ ఈ ఏడాది 40 రోజుల ముందుగానే మంచు టోక్యోవాసులను పలకరించింది. ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వరకు మంచు కురిసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే తరహాలో మంచుకురిస్తే మాత్రం రోడ్లమీద మంచు గడ్డలు పేరుకుపోతాయని.. తద్వారా అదో రికార్డు అవుతుందని అధికారులు చెప్తున్నారు. 
 
40 రోజుల కంటే ముందుగా మంచు కురవడంతో.. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మంచుకు అనుగుణంగా ఆహారం, ఆరోగ్య సూత్రాలను తెలియజేస్తున్నారు. ఇంకా వాహన రాకపోకలపై ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్యాంటు ప్యాకెట్లోని ఈ-సిగరెట్ పేలింది.. ఉన్నట్టుండి.. బాణసంచా పేలుడులా అనిపించి..?