Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్యాంటు ప్యాకెట్లోని ఈ-సిగరెట్ పేలింది.. ఉన్నట్టుండి.. బాణసంచా పేలుడులా అనిపించి..?

ఈ-సిగరెట్ కాల్చే అలవాటు చాలామందికి ఉంటుంది. విదేశాల్లో ఈ సిగరెట్‌కు క్రేజ్ ఎక్కువ. అయితే ఈ-సిగరెట్ పేలిన ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల

Advertiesment
E-cigarette explodes in man's pants
, గురువారం, 24 నవంబరు 2016 (17:15 IST)
ఈ-సిగరెట్ కాల్చే అలవాటు చాలామందికి ఉంటుంది. విదేశాల్లో ఈ సిగరెట్‌కు క్రేజ్ ఎక్కువ. అయితే ఈ-సిగరెట్ పేలిన ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్రాంతంలో షాపింగ్ చేస్తున్న వ్యక్తి ప్యాంటులో ఉన్న ఈ-సిగరెట్ ఒక్కసారిగా పేలింది. దీంతో చిన్న గాయాలతో సదరు వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఉన్నట్టుండి ఏదో బాణసంచా కాల్పుల్లా తనకు అనిపించిందని.. తీరా చూస్తే ప్యాంటులో నుంచి మంటలు రావడం చూసి జడుసుకున్నాడని బాధిత వ్యక్తి చెప్పాడు. చేతికి కాలికి గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సాధారణంగా బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రానిక్ సిగరెట్లకు మంటలు అంటవు. అప్పుడప్పుడు మాత్రం ఇలా జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. కాగా ఈ సిగరెట్లతో ప్రయాణానికి అమెరికా నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చట్టాలు చేసేవారే పొగ ఊదేస్తే... పార్లమెంటు ముందు చూడండి ఈ ఎంపీ పొగరాయుడు...