Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14 యేళ్లలో 600 మంది బాలికలపై అత్యాచారం.. ఈ కామ రాక్షసుడు ఎక్కడివాడు?

దేశ రాజధాని ఢిల్లీలో మరో కామాంధుడి గుట్టు బహిర్గతమైంది. ఐదుగురు బిడ్డల తండ్రి ఒకరు.. 14 యేళ్ళలో వందల మంది యువతులను లైంగికంగా వేధించిన వ్యవహారం తాజాగా బహిర్గతమైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... సునీల్ రస్

Advertiesment
14 యేళ్లలో 600 మంది బాలికలపై అత్యాచారం.. ఈ కామ రాక్షసుడు ఎక్కడివాడు?
, సోమవారం, 16 జనవరి 2017 (14:12 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో కామాంధుడి గుట్టు బహిర్గతమైంది. ఐదుగురు బిడ్డల తండ్రి ఒకరు.. 14 యేళ్ళలో వందల మంది యువతులను లైంగికంగా వేధించిన వ్యవహారం తాజాగా బహిర్గతమైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... సునీల్ రస్తోగీ అనే 38 యేళ్ళ వ్యక్తి ఢిల్లీలో నివాసముంటున్నాడు. ఈయనకు భార్యతో పాటు ఐదుగురు పిల్లలు ఉన్నారు. కామంతో కొట్టుమిట్టాడే సునీల్.. తన కామవాంఛను తీర్చుకునేందుకు తొలుత 7 నుంచి 10 ఏళ్ల వయస్సు ఉన్న బాలికలపై కన్నేస్తాడు. ఆ తర్వాత వారి వద్దకు వెళ్లి మీ తల్లిదండ్రులు కొత్త దుస్తులు ఇవ్వమన్నారని నమ్మించి.. తన దారిలోకి తెచ్చుకుని వారిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు.
 
2004లో అతను పోరుగింటి వారి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో స్థానికులు అతన్ని తన్ని తరిమేశారు. తర్వాత కూడా తరచూ ఆ ప్రాంతాన్ని సందర్శించేవాడు. జనవరి 10వ తేదీన ఇతనిపై స్థానికుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని కుమార్తెలను కిడ్నాప్‌ చేసి లైంగకదాడి చేసినట్లు దీనిలో పేర్కొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 
 
దీంతో సునీల్ రస్తోగీ వ్యవహారం బయటపడింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించాడు. కాగా, సునీల్‌ 2006లో ఉత్తరాఖండ్‌లో జైలు జీవితం అనుభవించాడు. తన ముగ్గురు కుమార్తెలపైనా కూడా లైంగికదాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇన్ని నేరాలు చేసినా.. అతన్ని ఎవరూ గుర్తించలేక పోవడంపై పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. కాగా, ఇతనిపై గతంలో మాదకద్రవ్యాల కేసు, వేధింపుల కేసులు, దొంగతనాల కేసులు కూడా ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో డేటా వేగం ఎంత? మైస్పీడ్ యాప్‌ ఆధారంతో ట్రాయ్ సేకరణ.. భారీ పెట్టుబడులకు రంగం సిద్ధం!