జియో డేటా వేగం ఎంత? మైస్పీడ్ యాప్ ఆధారంతో ట్రాయ్ సేకరణ.. భారీ పెట్టుబడులకు రంగం సిద్ధం!
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా ప్రకటనతో సంచలనం సృష్టించిన న్యూ టెలికామ్ ఆపరేటర్ రిలయమ్స్ జియో ఇన్ఫోకామ్ భారీ విస్తరణకు రంగం సిద్ధం చేస్తోంది. తన నెట్వర్క్ సామర్థ్యం పెంపుకోసం భారీగా పెట్టుబడులుపెట్టేందుకు
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా ప్రకటనతో సంచలనం సృష్టించిన న్యూ టెలికామ్ ఆపరేటర్ రిలయమ్స్ జియో ఇన్ఫోకామ్ భారీ విస్తరణకు రంగం సిద్ధం చేస్తోంది. తన నెట్వర్క్ సామర్థ్యం పెంపుకోసం భారీగా పెట్టుబడులుపెట్టేందుకు యోచిస్తోంది. నెట్వర్క్ కెపాసిటీ పెంచుకోవడానికి గాను రూ.30 వేల కోట్లను పెట్టుబడి పెట్టబోతోంది. రూ. 10 ముఖవిలువ కలిగిన సుమారు 6 బిలియన్ల ఆప్షనల్లీ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (9శాతం) జారీ ద్వారా ఈ సొమ్మును సమీకరించనుంది.
ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా చందాదారుల మొబైల్ డేటా వేగం ఎంత నమోదవుతుందో మైస్పీడ్ యాప్ ఆధారంగా ట్రాయ్ సేకరిస్తోంది. ఈ క్రమంలో టెలికామ్ కంపెనీ రిలయన్స్ జియో మొబైల్ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ డిసెంబరులో సగటున 18.16 ఎంబీపీఎస్‌కు చేరింది.
కంపెనీకి సెప్టెంబరు నుంచి ఇదే అధిక సగటు అని ట్రాయ్ వెల్లడించింది. నవంబరులో ఇది 5.85 ఎంబీపీఎస్‌గా ఉంది. డిసెంబరులో వొడాఫోన్ 6.7 ఎంబీపీఎస్, ఐడియా 5.03, భారతి ఎయిర్‌టెల్ 4.68, బీఎస్‌ఎన్‌ఎల్ 3.42, ఎయిర్‌సెల్ 3, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 2.6 ఎంబీపీఎస్ నమోదు చేశాయి.