Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : అంతుచిక్కని కేజ్రీవాల్ వ్యూహాలు... ప్రధాని మోడీకి ప్రతిష్టాత్మకం!

Advertiesment
delhi election

ఠాగూర్

, మంగళవారం, 28 జనవరి 2025 (14:41 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెలలో జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాగే, తిరిగి అధికారంలోకి రావాలని అధికార ఆప్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. కేజ్రీవాల్ వ్యూహాలు కమలనాథులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 
 
2014 నుంచి ఆయన అనుసరిస్తున్న వ్యూహాలను డీకోడ్ చేయలేక బీజేపీ ఎదుర్కొంటోంది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దేశంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తుంది. కానీ, ఢిల్లీ మాత్రం ఆయన పార్టీకి పరాజయం తప్పడం లేదు. 
 
గత రెండుసార్లు బీజేపీ చాలా దారుణ పరాజయాలు ఎదుర్కొంది. ఇది మోడీ ప్రతిష్ఠను మసకబారేలా చేస్తోంది. గతంలో పలుమార్లు ఓటమి అంచుల్లోకి వెళ్లి మరీ విజయం సాధించిన మోదీ.. విచిత్రంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూస్తూనే ఉన్నారు. ‘కోడ్ కేజ్రివాల్’ ఇప్పటికీ బీజేపీకి మిస్టరీగా మారింది. దీంతో కేజ్రివాల్ వ్యూహాలను ఛేదించేందుకు బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోంది. 
 
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేజీవాల్ మరింత దూకుడుగా ముందుకెళ్తూ బీజేపీని ఎక్కడికక్కడ ట్రాప్ చేస్తున్నారు. బీజేపీ అనూహ్యంగా అందులో చిక్కుకుని విలవిల్లాడుతోంది. కేజీవాల్ ఈ ఎన్నికలు కత్తి మీద సాములాంటివనే చెప్పాలి. అవినీతి ఆరోపణలు, జైలుకు వెళ్లడం వంటివి ఆయనను కొంత దుర్బలంగా మార్చాయి. 
 
అయితే, ఈ ఎన్నికలు తన దశాబ్దకాల కెరీర్లో అత్యంత క్లిష్టమైనవని ఆయనకు తెలుసు. దీనికి తోడు 11 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను కూడా ఆయన ఈ ఎన్నికల్లో ఎదుర్కోవాల్సి ఉంది. దేశాన్ని అవినీతి రహిత సమాజంగా మారుస్తానని ఒకప్పుడు హామీ ఇచ్చిన కేజ్రివాల్ ఇప్పుడు స్వయంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం ఆయనను మానసికంగా కొంత బలహీనంగా మార్చాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి కూడా బీజేపీ ఓడిపోతే కనుక బీజేపీని తప్ప మరెవరినీ లేమని నిపుణులు చెబుతున్నారు.
 
2013లో మోడీ దేశంలో హీరోగా మారినప్పుడు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో 303 సీట్లతో ఆయన ప్రజాదరణఅమాంతం పెరిగినప్పుడు కూడా కేజీవాల్‌ను ఏమీ చేయలేకపోయారు. కేజ్రివాల్ అబద్ధాలకోరు అని, సొంత గురువు అన్నా హజారేను మోసం చేశారని, ఒకప్పటి తన సహచరులను వదిలేశారని, ఆయన నకిలీ హిందువు అని, అవకాశవాది అని, అర్జన్ నక్సల్ అని.. ఇలా బీజేపీ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు పట్టించుకోకుండా ఆయనకే పట్టం కట్టారు. 
 
ఈ నేపథ్యంలో ఇప్పుడీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికారాన్ని నిలుపుకోవాలని కేజీవాల్, ఈసారి ఎలాగైనా ఆయనను పడగొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి గెలిచేది ఎవరో తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు.. మే 15 నుండి మే 26 వరకు 12 రోజుల పాటు...