Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యేల దాడి!

ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేసినట్టు సమాచారం. అదీ కూడా సాక్షాత్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఆయన సమక్షంలోనే ఈ దాడి జరిగినట్టు వార్తలు గుప్పుమ

ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యేల దాడి!
, మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (14:24 IST)
ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేసినట్టు సమాచారం. అదీ కూడా సాక్షాత్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఆయన సమక్షంలోనే ఈ దాడి జరిగినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగిందనే వార్తలు వస్తున్నాయి.
 
ఢిల్లీ మీడియా వర్గాల సమాచారం మేరకు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద ఇంటింటికీ సరకులను చేరవేయడానికి సంబంధించి ఒక సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌తో పాటు ఆప్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. అపుడు సీఎం, ఎమ్మెల్యేలు చేసిన సూచనలు ఆయన తిరస్కరించినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, లెఫ్టినెంట్ గవర్నర్‌కే జవాబుదారీగా ఉంటానని, ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు కాదని ప్రకాశ్ అనడంతో ఆప్ ఎమ్మెల్యేలు ఆగ్రహించి దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఘటన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమక్షంలోనే జరిగింది. ఒక ఎమ్మెల్యే అయితే ప్రకాశ్ కాలర్ పట్టుకుని అటూ, ఇటూ ఊపేశారు. దాడి చేసినవారిలో కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన అమానతుల్లా ఖాన్‌గా చెపుతున్నారు. 
 
దీనిపై అమానతుల్లా ఖాన్ స్పందిస్తూ సీఎస్ ప్రకాశ్‌పై దాడి జరిగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను తమ పార్టీ విడుదల చేస్తుందన్నారు. ప్రకాశ్ తప్పుగా ప్రవర్తించారని, సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్ళిపోయారన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరిచిన పామును కరకర నమిలేశాడు.. ఎవడు?