బాలికతో బాలుడి సహజీవనం... ఆపై అత్యాచారమంటూ పోస్కో చట్టం కింద కేసు
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇద్దరు మైనర్లు ఒక యేడాది పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఆ బాలుడు విడిపోతుంటే... తనపై అత్యాచారం చేశాడంటూ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలుడిపై పోస్కో చట్టం క
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇద్దరు మైనర్లు ఒక యేడాది పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఆ బాలుడు విడిపోతుంటే... తనపై అత్యాచారం చేశాడంటూ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఆగ్నేయ ఢిల్లీలో జైత్పూర్ ప్రాంతానికి చెందిన ఓ 14 ఏళ్ల మైనర్ బాలిక తనపై 16 ఏళ్ల బాలుడు యేడాది పాటు పలుమార్లు అత్యాచారం జరిపాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో కలిసి ఉంటూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఆ ఇద్దరూ స్నేహితులని వారు కలిసి ఉంటూ సంబంధం ఏర్పర్చుకున్నారని పోలీసులు చెపుతున్నారు. ఏడాది తర్వాత తన ఇంటి నుంచి బాలుడు వెళ్లిపోతున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు. చివరకు బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.