Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాపిల్ ఐఫోన్ 7 వచ్చేస్తోంది... యాపిల్ వాచ్ 2ను కూడా.. లాంచ్ చేస్తారా?

యాపిల్ తన ఐఫోన్‌లో 7వ తరాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమైంది. టెక్నాలజీ దిగ్గజమైన యాపిల్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లను లాంచ్ చేయడానికి ముహూర్తం ఖారారు చేసింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో సె

Advertiesment
Massive iPhone 7 Leak Reveals 15 New Features
, మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (09:50 IST)
యాపిల్ తన ఐఫోన్‌లో 7వ తరాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమైంది. టెక్నాలజీ దిగ్గజమైన యాపిల్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లను లాంచ్ చేయడానికి ముహూర్తం ఖారారు చేసింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో సెప్టెంబర్ 7న వీటిని ప్రవేశపెట్టనున్నారు. కొత్త రంగుల్లో ఐఫోన్ 7 లభించనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ వాచ్ 2ను కూడా ఇదే కార్యక్రమంలో లాంచ్ చేయనున్నారు. 
 
అయితే దీనిలో ఏ10 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, వాటర్ ప్రూఫ్ తదితర ఫీచర్లున్నాయి. ఇది ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. దీనిలో డ్యుయల్ లెన్స్ సెటప్‌తో ముందు కెమెరా ఉంటుందట. సెప్టెంబర్ 9 నుంచి వీటి ప్రీ-ఆర్డర్లను యాపిల్ చేపట్టి, సెప్టెంబర్ 16నుంచి విక్రయాలు చేపట్టనున్నట్టు ఫోర్బ్స్ రిపోర్టు తెలిపింది. 
 
ఐఫోన్7గా వినియోగదారుల ముందుకు రాబోతున్న ఈ ఫోన్, డ్యుయల్ కెమెరా, ప్రెషర్ సెన్సిటివ్ హోమ్ బటన్, బ్లూటూత్ సపోర్టెడ్ హెడ్ ఫోన్స్, డ్యుయల్ స్పీకర్స్, టైప్-సీ ఇంటర్ ఫేస్లు ప్రత్యేక ఫీచర్లుగా అలరించబోతున్నాయట. శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన గెలాక్సీ నోట్7కు పోటీగా యాపిల్ తన ఐఫోన్ను విడుదల చేయనున్నట్లు మార్గెట్ వర్గాల సమాచారం.
 
కానీ ఈ ఫోన్ లాంచింగ్పై అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. సెప్టెంబర్లో ప్రవేశపెట్టబోయే ఫోన్ ఐఫోన్ 6ఎస్ఈ అని, పూర్తి రీడిజైన్డ్ ప్రొడక్ట్ను 2017లో యాపిల్ పదేళ్ల వార్షిక సందర్భంగా ఆవిష్కరిస్తుందని వార్తలొస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'జుట్టు పట్టుకుని పైకితీసుకొచ్చి' పరిచయం చేయాలన్న కోరిక లేదు : కె.రోశయ్య