Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను మీతో కలిసి నడుస్తా... జయ మేనకోడలు దీప... ఎవరితో?

తమిళ రాజకీయాలు చూస్తుంటే రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోను అధికార, ప్రతిపక్ష నేతలకు మధ్య మాటల యుద్ధాలు జరుగుతుంటాయి. కానీ తమిళనాడులో మాత్రం అధికార పార్టీలోని నేతలే వేర్వేరుగా విడిపోయి ఇప్పుడు రాజకీయ రగడను కొనసాగిస్తున్నారు. జయలలిత మరణం

Advertiesment
నేను మీతో కలిసి నడుస్తా... జయ మేనకోడలు దీప... ఎవరితో?
, శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (18:07 IST)
తమిళ రాజకీయాలు చూస్తుంటే రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోను అధికార, ప్రతిపక్ష నేతలకు మధ్య మాటల యుద్ధాలు జరుగుతుంటాయి. కానీ తమిళనాడులో మాత్రం అధికార పార్టీలోని నేతలే వేర్వేరుగా విడిపోయి ఇప్పుడు రాజకీయ రగడను కొనసాగిస్తున్నారు. జయలలిత మరణం తరువాత వారసురాలిగా చెప్పుకుంటే ఆస్థిని ఎలాగైనా సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న దీప సొంతంగా పార్టీ పెట్టారు. ఇది అందరికీ తెలిసిందే.
 
అయితే పార్టీ పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు. దీప సేమ్ టు సేమ్ జయను పోలి ఉండటంతో కొంతమంది అన్నాడిఎంకే నేతలు ఆమె వెంట ఉండిపోయారు. దీంతో దీపకు అంతోఇంతో తమిళనాడులో పేరొచ్చింది. అంతేకాదు నేషనల్ మీడియా ఛానళ్ళను తనవైపు తిప్పుకున్న దీప అలా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ దీప అంటే ఎవరో అందరికీ తెలిసేలా చేసేసింది. మొదట్లో పన్నీరుసెల్వంతో కలిసి ముందుకు వెళదామనుకున్న దీప ఆ తరువాత వెనక్కి తగ్గింది. 
 
సొంతంగానే ముందుకు వెళ్ళాలి. జయ ఆస్తులను తానే దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. కానీ చివరకు ఆ అవకాశం కాస్త దక్కలేదు. ప్రస్తుతం పళణిస్వామి-పన్నీరుసెల్వంలు ఒక్కటవ్వడం.. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రభుత్వాన్ని నడిపేయడంతో దీప పన్నీరుతో కలవడానికి సిద్ధమైంది. 
 
మరో రెండుమూడురోజుల్లో స్వయంగా వచ్చి మాట్లాడుతానని తన అనుచరులతో దీప కబురు కూడా పంపేసింది. అధికార పార్టీ విబేధాల కన్నా స్నేహంగా మెలిగితేనే తనకు మంచిదన్న ఆలోచనలో వచ్చేసింది దీప. అయితే దీపకు పళణిస్వామి అంటే అస్సలు ఇష్టం లేదు. పన్నీరుసెల్వంతో కలిసినా దీప పళణిస్వామితో కలుస్తుందా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది. దీప పన్నీరుసెల్వంతో కలవడం తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింధూరంపై నిషేధం విధించనున్న అమెరికా? వాడటం మంచిది కాదట?