Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజకీయాల్లోకి దీపా జయకుమార్.. పచ్చబొట్టు పొడిపించుకున్నారు.. ఆర్కే నగర్ నుంచి పోటీ...

దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలని తానేనని ఆమె మేనకోడలు దీప జయకుమార్‌ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఆమె రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు అంతా తాననే వారసురాలిగా పేర్కొంటున్నా

Advertiesment
Deepa Jayakumar
, గురువారం, 19 జనవరి 2017 (09:50 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలని తానేనని ఆమె మేనకోడలు దీప జయకుమార్‌ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఆమె రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు అంతా తాననే వారసురాలిగా పేర్కొంటున్నారని, శశికళను కాదని అన్నారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకులు ఎంజీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆమె తన అనుచరులతో కలిసి మెరీనా బీచ్‌కు చేరుకొని శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 
 
జయలలిత పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 24న తాను రాజకీయాల్లోకి వచ్చే అంశంపై తన భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. ఆ రోజు తన జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతుందని పేర్కొన్నారు. మెజార్టీ తమిళులు జయ రాజకీయ వారసురాలిగా తననే కోరుకుంటున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. జయ అడుగుజాడల్లోనే నడిచి ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ఆమె నియోజకవర్గం ఆర్కే నగర్‌లో పోటీకి దిగుతానని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే పార్టీ కార్య కర్తలు తననే వారి నాయకురాలిగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో దీప రాజకీయాల్లోకి రానున్న తరుణంలో ఆమెకు క్రేజ్ అమాంతంగా పెరిగిపోతోంది. ఇందులో భాగంగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపకు మద్దతుగా ఆమె బొమ్మను వంటిపై పచ్చబొట్టుగా వేయించుకొనేందుకు కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత శతజయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యారు. 
 
పార్టీ పగ్గాలను దీప చేపట్టాలని కోరుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన దీపా పేరవై కార్యకర్తలు కూడా ఎంజీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో విరుదాచలానికి చెందిన దీప మద్దతుదారులు విరుదాచలేశ్వర ఆలయం నుంచి స్టేట్‌ బ్యాంక్‌ బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించి అక్కడున్న ఎంజీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు కార్యకర్తలు దీప బొమ్మను తమ భుజంపై పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఎంజీఆర్‌, జయలలిత ఆశయాలు, లక్ష్యాలను దీప మాత్రమే పూర్తిచేస్తుందని కార్యకర్తలు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ నిర్ణయాలు కుల మూలాలకే ప్రమాదం : పవన్ కళ్యాణ్