Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వ నిర్ణయాలు కుల మూలాలకే ప్రమాదం : పవన్ కళ్యాణ్

వృత్తుల ఆధారంగా ఏర్పడిన కుల వ్యవస్థలో ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కుల మూలాలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందువల్ల పాలకులు నిర్ణయాలు తీసుకునే ముందు

Advertiesment
Amaravati
, గురువారం, 19 జనవరి 2017 (09:43 IST)
వృత్తుల ఆధారంగా ఏర్పడిన కుల వ్యవస్థలో ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కుల మూలాలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందువల్ల పాలకులు నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజలకు నష్టం లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వ విధానాల వల్ల తమకు నష్టం జరుగుతోందని కృష్ణానది లంక గ్రామాలకు చెందిన రైతులు, పోలవరం మూల లంక రైతులు హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తమపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వారు పవన్‌కు వివరించారు. 
 
పోలవరం ప్రాజెక్టు పరిధిలో స్పిల్‌వే నిర్మాణం నిమిత్తం తవ్వుతున్న మట్టి, రాళ్లను నేరుగా తాము సాగుచేసే భూముల్లో పోసి డంపింగ్‌ యార్డుగా మార్చేశారని, పరిహారం విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా అనుసరిస్తోందని, ఫలితంగా బతుకులు నాశనమయ్యాయని మూల లంక రైతులు పవన్‌తో మొరపెట్టుకున్నారు. ఆ తర్వాత రైతుల సమస్యలపై పవన్ సానుకూలంగా స్పందించారు. రైతులకు తమ పార్టీ అండ ఉంటుందన్నారు. రెండు ప్రాంతాల్లోనూ త్వరలోనే పర్యటిస్తానని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతితో వివాహేతర సంబంధం.. ప్రశ్నించిన భార్యపై బొద్దింకలు వదిలి.. పైశాచికంగా?