తమిళనాడులో పరువు హత్య : పెళ్లికి ముందే కోరిక తీర్చమన్నాడు.. కాదన్నందుకు కడతేర్చాడు!
తమిళనాడు రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగింది. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోకముందే ఆమె ప్రియుడు తన కోరిక తీర్చమన్నాడు. ఇందుకు ఆ యువతి నిరాకరించింది.
తమిళనాడు రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగింది. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోకముందే ఆమె ప్రియుడు తన కోరిక తీర్చమన్నాడు. ఇందుకు ఆ యువతి నిరాకరించింది. దీంతో తన స్నేహితుడితో కలిసి ఆ యువతి ఇంటికెళ్లి.. చేతులు కాళ్లు కట్టేసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ముఖంపై ఇటుక రాయితో కొట్టి చంపేశారు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా సానియమంగళంలో గత ఆదివారం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
కలైసెల్వి అనే 20 యేళ్ళ బాలిక ఇటీవలే పదో తరగతి ఉత్తీర్ణురాలైంది. ఈమెను అదే ప్రాంతానికి చెందిన పి రాజా అలియాస్ అరంగనాథన్ (32) అనే వ్యక్తి ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే, గత ఆదివారం సాయంత్రం తన స్నేహితుడు ఆర్ కుమార్ (30)తో కలిసి కలైసెల్వి ఇంటికి వెళ్లిన రాజా... తన కోరిక తీర్చమన్నాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంత వారిద్దరు కలిసి ఆ యువతిపై బలవంతంగా అత్యాచారం చేశారు.
పిమ్మట చున్నీతో గొంతు బిగించి చంపేశారు. అంతటితో వారి కసి చల్లారక ఇటుక రాయితో ముఖంపై కొట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస రాజాను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కుమార్ కోసం గాలిస్తున్నారు. ఈ ఇద్దరు యువకులు ఉన్నత వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం.