ముద్దుల సుమిత్ దొరికిపోయాడు.. అమ్మాయిలతో మాట్లాడుతూ.. ఒక్కసారి కిస్సిచ్చి పారిపోతాడు..
ముద్దుల సుమిత్ దొరికిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న యువతుల వద్ద వెళ్లి వారితో మాట్లాడుతున్నట్లు నటించి ఒక్కసారి ముద్దు పెట్టి పరారయ్యే క్రేజీ సుమిత్ (21) పోలీసులకు చిక్కాడు. ఇలాంటి చర్యలతో సోషల్ మీడియాలో
ముద్దుల సుమిత్ దొరికిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న యువతుల వద్ద వెళ్లి వారితో మాట్లాడుతున్నట్లు నటించి ఒక్కసారి ముద్దు పెట్టి పరారయ్యే క్రేజీ సుమిత్ (21) పోలీసులకు చిక్కాడు. ఇలాంటి చర్యలతో సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయిన అతడిని పోలీసులు విచారిస్తున్నారు. సుమిత్ అప్‌లోడ్ చేసిన వీడియోల్లో ఉన్న అమ్మాయిల కోసం వెతుకుతున్నట్టు పేర్కొన్నారు. సుమిత్ చెప్పేది నిజమైనా, కాకున్నా అతడు మాత్రం శిక్షార్హుడేనని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే గురుగ్రామ్‌లోని డబ్ల్యూసీటీసీ కాలేజ్‌లో అతడు బీసీఏ చివరి సంవత్సరం చదువుతున్నట్టు పోలీసులు వివరించారు. యువతులకు ముద్దు పెట్టే సీన్లను చిత్రీకరించే సుమిత్ స్నేహితుడు సత్యజీత్ కడ్యన్(23)ను కూడా పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
తాను ముద్దు పెట్టిన అమ్మాయి తన బృందంలోని సభ్యురాలేనని విచారణలో సుమిత్ పోలీసులతో చెప్పినట్టు సమాచారం. సుమిత్ వ్యవహారంపై బాధిత యువతుల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని, వారు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.