Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశమంతటా గోవధను నిషేధించేలా ఆదేశాలు ఇవ్వలేం: సుప్రీం కోర్టు

గోవధకు సంబంధించి సుప్రీం కోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గోవధను సమూలంగా నిషేధించాలని, కబేళాలను ఎత్తేసేలా ఉత్తర్వులు జరీచేయాలని కోరుతూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌

దేశమంతటా గోవధను నిషేధించేలా ఆదేశాలు ఇవ్వలేం: సుప్రీం కోర్టు
, శుక్రవారం, 27 జనవరి 2017 (12:38 IST)
గోవధకు సంబంధించి సుప్రీం కోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గోవధను సమూలంగా నిషేధించాలని, కబేళాలను ఎత్తేసేలా ఉత్తర్వులు జరీచేయాలని కోరుతూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)ను శుక్రవారం కొట్టేసింది. సదరు వ్యాజ్యం విచారణకు ఏమాత్రం అర్హం కాదని స్పష్టం చేసింది. 
 
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ గోవధపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గోవుల అక్రమ రవాణాపై ఇప్పటికే తాను మార్గదర్శకాలు ఇచ్చానన్న సుప్రీంకోర్టు.. కొత్తగా సంపూర్ణ గోవధ నిషేధం పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది. 
 
'కొన్ని రాష్ట్రాలు గోవధను నిషేధించాయి. ఇంకొన్ని రాష్ట్రాలు అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. రాష్ట్రాలు రూపొందించుకునే చట్టాలపై మేం జోక్యం చేసుకోలేం. దేశమంతటా గోవధను నిషేధించేలా ఆదేశాలు ఇవ్వలేం..'అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
 
మహారాష్ట్ర, హరియాణా, మధ్యప్రదేశ్‌ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు గోవధను, గోమాంసాన్ని నిషేధించిన నేపథ్యంలో, దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా అదే విధానాన్ని అవలంభించాలని ఒక వర్గం నుంచి డిమాండ్‌ వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీనిపై వినీత్‌ సహాయ్‌ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్‌ వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూతుర్ని పక్కనబెట్టుకుని పోర్న్ ఫిలిమ్స్ కలెక్ట్ చేసుకునే వర్మ ఏం మాట్లాడాలి?: పవన్