Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూతుర్ని పక్కనబెట్టుకుని పోర్న్ ఫిలిమ్స్ కలెక్ట్ చేసుకునే వర్మ గురించి ఏం మాట్లాడాలి?: పవన్

మెగా ఫ్యామిలీపై విరుచుకుపడుతూ ట్విట్టర్లో నోటికొచ్చినట్లు ట్వీట్ చేసే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. 50ఏళ్ల వ్యక్తి, ఆయనకో పెళ్లైన కూతురుందన్నారు. ఆ కు

Advertiesment
Pawan Kalyan Response To RGV Twitter Comments
, శుక్రవారం, 27 జనవరి 2017 (11:18 IST)
మెగా ఫ్యామిలీపై విరుచుకుపడుతూ ట్విట్టర్లో నోటికొచ్చినట్లు ట్వీట్ చేసే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. 50ఏళ్ల వ్యక్తి, ఆయనకో పెళ్లైన కూతురుందన్నారు. ఆ కుమార్తెను పెట్టుకుని పోర్నోగ్రఫీ ఫిలింస్‌‍ను తాను కలెక్ట్ చేసుకుంటానని చెప్పే వ్యక్తి గురించి నన్ను ఏం మాట్లాడమంటారు? ఇక నేను ఏం చెప్పాలి? ఒకరోజు నన్ను ఎత్తొచ్చు, ఒకరోజు నన్ను తగ్గించొచ్చు. అన్నింటిపైనా మాట్లాడలేను" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తనకు రాంగోపాల్ వర్మపై గౌరవం ఉందని అంటూనే, గతంలో ఆయన గురించి మాట్లాడలేదని, ఇకపైనా మాట్లాడబోనని చెబుతూనే ఆయన వైఖరిపై పవన్ ఫైర్ అయ్యారు. 
 
కాగా.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జనసేన ప్రధాన కార్యాలయంలో శుక్రవారం పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘చంద్రబాబుకు పరిపాలనా అనుభవం ఉన్నదన్న ఒకే ఒక్క కారణంతో గత ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇచ్చాం. కానీ ఇవ్వాళ ఆయన తప్పు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు.. ఇప్పుడేమో హోదా సంజీవనికాదు, గతించిన అధ్యాయం అని నాలుక మడతపెట్టారు. అసలు ఏపీలో టీడీపీ పాలనేలేదు. అది మినీ బీజేపీలా తయారైందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పందుల ఆటలు ఆడుకోమని సుజనా వ్యాఖ్యలు తప్పే.. పవన్ పొలిమేర దాటలేదా?