Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆవు పాలు ఇవ్వడమే కాదు.. పరీక్ష కూడా రాసింది.. ఎక్కడ?

గోవు.. హిందువులకు అత్యంత పవిత్రమైనది. గోమాతను పూజిస్తే సకల సౌభాగ్యాలు ఒనగూరుతాయని భావిస్తుంటారు. అలాగే, అవు పాలు కూడా ఇస్తుంది. ఈ పాలు ఎంతో శ్రేష్టమైనవి. అయితే, ఆవు పాలు ఇవ్వడమే కాదు పరీక్ష కూడా రాసిం

ఆవు పాలు ఇవ్వడమే కాదు.. పరీక్ష కూడా రాసింది.. ఎక్కడ?
, సోమవారం, 8 ఆగస్టు 2016 (13:24 IST)
గోవు.. హిందువులకు అత్యంత పవిత్రమైనది. గోమాతను పూజిస్తే సకల సౌభాగ్యాలు ఒనగూరుతాయని భావిస్తుంటారు. అలాగే, అవు పాలు కూడా ఇస్తుంది. ఈ పాలు ఎంతో శ్రేష్టమైనవి. అయితే, ఆవు పాలు ఇవ్వడమే కాదు పరీక్ష కూడా రాసింది. ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదా? అయితే.. ఈ కథనం చదవాల్సిందే. 
 
జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం 'బోర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్(బీవోపీఈఈ)' నిర్వహించింది. ఈ పరీక్ష కూడా జారీ అయిన హాల్‌టికెట్‌ను చూస్తే ప్రతి ఒక్కరూ నోరెళ్లబెట్టాల్సిందే. అదెలాగంటారా.. కచిర్ గావ్ (గోధుమ రంగు ఆవు).. డాటర్ ఆఫ్ గూరా దండ్(ఎర్ర ఎద్దు).. వయసు 18 ఏళ్లు అంటూ పూర్తి వివరాలున్నాయి. సంతకం, వేలిముద్రల బాక్సుల్లో తోక, గిట్ట ఫొటోలూ ఉన్నాయి! ఉదయం 9:55 గంటలు దాటితే ప్రవేశం లేదనీ హాల్‌టికెట్‌లో పేర్కొన్నారు. 
 
2015, మే 10వ తేదీన జరిగే పరీక్ష రాసేందుకు ఈ హాల్‌టికెట్ జారీ అయింది. ఈ హాల్‌టికెట్ కాపీ కాశ్మీర్ ప్రతిపక్ష పార్టీ నేత జునైద్ అజీమ్ మట్టూ చేతికి దొరికింది. ఇంకేముంది.. ఆయన చేతులు ముడుచుకుని కూర్చొంటారా? హాల్‌టికెట్ కాపీని ట్విటర్‌లో పెట్టారు. దీంతో ఆవు-పరీక్ష సంగతి వెలుగుచూసింది. విద్యామంత్రి నయీం అక్తర్ హయాంలో మంచి ప్రగతి కనిపిస్తోందని, ఆవులూ హాల్‌టికెట్లు పొందగలుగుతున్నాయంటూ మట్టూ ట్వీట్ చేశారు.
 
అలాగే, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ ఆవు పరీక్ష బాగా రాస్తుందో లేదో చూడాలని ఉందన్నారు. చివరకు ఈ వార్త అధికారుల దాకా పాకడంతో వారు నాలుక్కర్చుకుని శనివారం ఉదయం హాల్‌టికెట్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించారు. దరఖాస్తులు, హాల్‌టికెట్ల జారీ ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరగడం వల్ల పొరపాటు చోటుచేసుకుందని బోర్డు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ఫరూక్ అహ్మద్ మీర్ వివరణనిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీడియో గేమ్ ''పొకెమాన్'' ఆడుతూ.. పరిసరాలను మరిచిపోయాడు.. బుల్లెట్‌కు బలైపోయాడు!