Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీడియో గేమ్ ''పొకెమాన్'' ఆడుతూ.. పరిసరాలను మరిచిపోయాడు.. బుల్లెట్‌కు బలైపోయాడు!

సోషల్ మీడియా ప్రభావం యువతపై బాగానే కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లను చేతబట్టుకుని ఎక్కడపడితే అక్కడ చాటింగ్‌లు, వీడియో గేమ్‌లు ఆడుకుంటూ ప్రస్తుత యువత సమయాన్ని వృధా చేస్తోంది. ఆ వీడియో గేమ్సే తాజాగా ఓ యువక

Advertiesment
College man killed playing Pokemon Go in Aquatic Park shows Pokemon developer's crime problem
, సోమవారం, 8 ఆగస్టు 2016 (13:21 IST)
సోషల్ మీడియా ప్రభావం యువతపై బాగానే కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లను చేతబట్టుకుని ఎక్కడపడితే అక్కడ చాటింగ్‌లు, వీడియో గేమ్‌లు ఆడుకుంటూ ప్రస్తుత యువత సమయాన్ని వృధా చేస్తోంది. ఆ వీడియో గేమ్సే తాజాగా ఓ యువకుడి ప్రాణాలపైకి తెచ్చింది. వివరాల్లోకి వెళితే.. ''పోకేమాన్ గో" ఆటలో నిమగ్నమై పరిసరాలను మరచిపోయిన 20 ఏళ్ల యువకుడిని ఓ దుండగుడు కాల్చిచంపాడు. ఈ ఘటన గన్ కల్చర్ పెరిగిపోతున్న అమెరికాలో  చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో వీడియో గేమ్స్ ఆడుతూ ఓ యువకుడు బుల్లెట్‌కు బలైయ్యాడు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆదివారం రాత్రి ఈ ఘటన చేటుచేసుకుంది. పర్యాటకులు అధికంగా వచ్చే వాటర్‌ఫ్రంట్ ప్రాంతంలోని ఘిరాడెల్లీ స్క్వేర్ వద్ద కాల్విన్ రైలీ అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో కాల్చి చంపినట్టు యూఎస్ పార్క్ పోలీసులు తెలిపారు.
 
రైలీ తన స్నేహితుడితో కలిసి 'పోకెమాన్‌ గో' ఆట ఆడుకుంటుడగా ఓ వ్యక్తి వచ్చి వెనుక నుంచి కాల్పులు జరిపినట్లు రైలీ ఫ్యామిలీ ఫ్రెండ్ జాన్ కిర్బీ వెల్లడించారు. అయితే ఈ కాల్పుడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ యువకుడి మృతికి గల కారణాలపై అన్నీ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తరగతి గదిలో దుస్తులు చించి... విద్యార్థుల ముందు.. టీచర్‌కు లైంగిక వేధింపులు!