Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య హింసిస్తుందా? ఆధారాలు లేవే.. ఒమర్ విడాకులపై కోర్టు

Omar Abdullah
, మంగళవారం, 12 డిశెంబరు 2023 (15:25 IST)
Omar Abdullah
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా విడాకుల పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
అయితే, విచారణ ముగింపులో, కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఒమర్ అబ్దుల్లాకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది. దీనికి సంబంధించి సవివరమైన నివేదికను ఇచ్చింది.
 
ఒమర్ అబ్జుల్లా గతంలో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కుటుంబ న్యాయస్థానం కూడా ఈ పిటిషన్‌ను కొట్టివేసిన తరువాత, అతను ఢిల్లీ హైకోర్టులో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ అనంతరం ఈరోజు కోర్టు తీర్పు వెలువరించింది.
 
ఒమర్ అబ్దుల్లా పాయల్‌ను 1 సెప్టెంబర్ 1994న వివాహం చేసుకున్నారు. దాదాపు 15 సంవత్సరాల వివాహం తర్వాత, ఈ ఇద్దరు భార్యాభర్తలు విభేదాల కారణంగా విడివిడిగా జీవించడం ప్రారంభించారు. దీంతో అబ్దుల్లా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. కానీ 2016 ఆగస్టు 30న కుటుంబ న్యాయస్థానం అతని పిటిషన్‌ను తిరస్కరించింది. 
 
ఒమర్ అబ్దుల్లాకు విడాకులను నిరాకరిస్తూ, అతని పిటిషన్‌లో చేసిన వాదనలకు బలమైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ఈ కేసులో కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో ఎలాంటి బలహీనత లేదు. ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాపై చేసిన క్రూరత్వ ఆరోపణలు నిరాధారమైనవని కుటుంబ న్యాయస్థానం సరైన రీతిలో పేర్కొంది. 
 
పాయల్ అబ్దుల్లాను మానసికంగా లేదా శారీరకంగా హింసిస్తున్నారని ఒమర్ అబ్దుల్లా నిరూపించలేకపోయారు. కాబట్టి ఈ వాదనలు నిరాధారమైనవి'' అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు మహా సభలకు ముఖ్య అతిథిగా నాగాలాండ్ గవర్నర్ ఇల.గణేశన్