రోడ్డు ప్రమాదాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. అయితే తాజాగా రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న వారిని వాహనాలతో ఈడ్చుకెళ్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా కోయంబత్తూరు జిల్లాలో సైకిల్‌పై వెళ్తున్న జంటను బస్సు ఢీకొని ఈడ్చుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.. రాజేంద్రన్ కోయంబత్తూరు జిల్లా కల్లిపాళయం ప్రాంతానికి చెందినవాడు. అతని భార్య దేవి. వీరిద్దరూ పూలువపట్టి మున్సిపల్ కార్యాలయంలో తాత్కాలిక క్లీనర్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
ఈ నేపథ్యంలో వీరిద్దరూ సైకిల్‌పై పనికి వెళ్తున్నారు. అంతలో వెనుకగా వచ్చిన ప్రభుత్వ బస్సు వారిని ఢీకొంది దీంతో వారిద్దరూ కిందపడిపోయారు. వీరిపై నుంచి బస్సు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలు బస్సులో చిక్కుకుని, బస్సు ఆగకముందే కొన్ని మీటర్లు ఈడ్చుకెళ్లడం జరిగింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దంపతుల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రభుత్వ బస్సు డ్రైవర్ లొంగిపోయాడు.