ఇచ్చిన రుణాన్ని తిరిగి ఇవ్వమంటే.. హత్య చేసి మూడు ముక్కలుగా నరికేశారు..

గురువారం, 16 మే 2019 (11:31 IST)
ఇచ్చిన రుణాన్ని తిరిగి ఇవ్వమని అడిగిన పాపానికి 40 ఏళ్ల మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన మంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బందేశ్వర్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ హత్య కేసులో జోనాస్ జోలిన్ శామ్‌సన్ (36), విక్టోరియా మథియాస్ (46) దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గురైన మహిళ పేరు శ్రీమతి అని.. ఈమె వద్ద నుంచి శామ్‌సన్ రుణంగా డబ్బును తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. 
 
శామ్‌సన్‌ను ఇచ్చిన రుణాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా ఆమె కోరింది. కానీ డబ్బును తిరిగి ఇవ్వలేని శామ్‌సన్ తన భార్యతో కలిసి శ్రీమతిని హత్య చేశాడు. తీసుకున్న లక్ష రూపాయల్లో శామ్‌సన్ రూ.40వేలు ఇచ్చాడని, మిగిలిన రుణాన్ని తిరిగి ఇవ్వని శామ్‌సన్‌ను నిలదీసింది. దీంతో ఆవేశానికి గురైన శామ్‌సన్ తన స్నేహితులతో కలిసి ఆమెను హత్య చేసి మూడు ముక్కలుగా నరికి.. గోనె సంచిలో కుక్కి.. నగరానికి ఆవతలి వైపు పారేశాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జరిపిన దర్యాప్తులో శామ్‌సన్ దోషి అని తేలింది. అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లిన సమయంలో ఆత్మహత్యానికి ప్రయత్నించిన శామ్‌సన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై 2010లో ఓ హత్య కేసు కూడా వుందని పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వింగ్ కమాండర్ అభినందన్ యూనిట్‌కు కొత్త బ్యాడ్జి