అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు సంబంధించిన పత్రాలతో పాటు.. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన రహస్య పత్రాలు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి చేతికి చిక్కాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిలదీశారు. ఈ రహస్య పత్రాలు స్వామి చేతికి ఎలా వచ్చాయంటూ నిలదీశారు.
అగస్టావెస్ట్‌ల్యాండ్ అంశంపై చర్చ సందర్భంగా పలు పత్రాల్లోని సమాచారాన్ని స్వామి బుధవారం సభలో చదివి వినిపించారని, అవి ప్రామాణికమేనా అని ప్రశ్నించింది. కాంగ్రెస్ ఉప నాయకుడు ఆనంద్‌శర్మ ఈ అంశంపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ, సీబీఐ, ఈడీకి చెందిన కీలకమైన రహస్య పత్రాలలోని సమాచారాన్ని స్వామి ఎలా వెల్లడి చేశారని ప్రశ్నించారు.