Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌పై భారత్ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ వార్... అంటే ఏమిటి?

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చొచ్చుకునిపోయి భారత్ బలగాలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేక పోతోంది. దీనికి ప్రతీగా భారత్‌పై దాడులు జరపాలన్న కసితో ఉంది.

Advertiesment
Indian Defence Review
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (15:30 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చొచ్చుకునిపోయి భారత్ బలగాలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేక పోతోంది. దీనికి ప్రతీగా భారత్‌పై దాడులు జరపాలన్న కసితో ఉంది. అయితే, భారత్ వేస్తున్న ఎత్తుల ముందు పాక్ దాడి చేసేందుకు ఏమాత్రం సాహసం చేయలేక పోతోంది. అయితే, భారత్‌పై అణ్వస్త్ర దాడికి దిగితే లాభలనష్టాలపై బేరీజు వేస్తున్నట్టు సమాచారం. 
 
ఒక దేశంపై అణ్వస్త్రాలను ప్రయోగించాలన్న నిర్ణయాన్ని మరో దేశం తీసుకోవడం అంత ఆషామాషీ కాదు. కొన్ని లక్షల మందిని దారుణంగా చంపడానికి తగిన కారణాలు ఉన్నాయని ఆ దేశం ప్రపంచానికి చాటాల్సి ఉంటుంది. ప్రపంచం దానిని విశ్వసించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇపుడు అణ్వస్త్ర ప్రయోగం ఎక్కడ ఏ దేశంపై జరిగినా దానివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నమై పోతుంది. అందువల్ల భారతపై అణ్వస్త్ర ప్రయోగం అనేది పాక్‌ ఒక్కటీ తీసుకోగల నిర్ణయం కాదు. ఆ నిర్ణయం సబబేనని ప్రపంచానికి పాక్‌ నిరూపించాల్సి ఉంటుంది. ఈమేరకు భారత కోల్డ్‌ స్టార్ట్‌ డాక్ట్రిన్‌కు రూపకల్పన చేసింది. 
 
కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ అంటే... 
మీ పక్కింటి వాడి దగ్గర ఓ కత్తి ఉంది. మీరు అతడిని రెండు తిట్లు తిడితే అతడు వెంటనే కత్తితో మిమ్మల్ని పొడిచేస్తాడా? లేదు కదా. పోనీ చిన్న చెంపదెబ్బ కొడితే మిమ్మల్ని కత్తితో పొడిచేస్తాడా? లేదు. మీరు కర్రతో గట్టిగా కొడితే అప్పుడు కత్తి పట్టుకుని వస్తాడు. అంటే పక్కింటి వాడి దగ్గర కత్తి ఉన్నా భయపడకుండా మీరు అతణ్ని రెండు తిట్లు తిట్టవచ్చు. చిన్న చెంపదెబ్బ కొట్టవచ్చన్నమాట. కోల్డ్‌ స్టార్ట్‌ డాక్ట్రిన్‌ కూడా ఇలాంటిదే. పాక్‌ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని భయపడి పూర్తిగా యుద్ధం మానుకోనక్కర్లేదు. ఏ స్థాయిలో పాక్‌కు నష్టం కలిగిస్తే పాక్‌ అణ్వస్త్ర ప్రయోగానికి దిగుతుందో అంచనావేసి, అంతకంటే కొంత తక్కువ స్థాయిలో నష్టం కలిగించేలా భారత యుద్ధం చేయవచ్చు, అప్పుడు పాక్‌ అణ్వస్త్ర దాడి చేయబోదు అనేది కోల్డ్‌ స్టార్ట్‌ డాక్ట్రిన్‌లో ప్రధానాంశం. ఇదే దీనర్థం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుడు నవ్వుకున్న యాపిల్‌కు ఐఫోన్ 7 పేలడంతో షాక్..