Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పుడు నవ్వుకున్న యాపిల్‌కు ఐఫోన్ 7 పేలడంతో షాక్..

అప్పట్లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలిపోతే లోలోపల నవ్వుకున్న యాపిల్‌కు షాక్ కొట్టింది. అమ్మకాలతో జోరందుకోవాలనుకున్న యాపిల్ ఐఫోన్ 7 పేలిందని వార్త రావడంతో యాపిల్ దిమ్మదిరిగింది. మైండ్ బ్లాస్టైంది

అప్పుడు నవ్వుకున్న యాపిల్‌కు ఐఫోన్ 7 పేలడంతో షాక్..
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (13:46 IST)
అప్పట్లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలిపోతే లోలోపల నవ్వుకున్న యాపిల్‌కు షాక్ కొట్టింది. అమ్మకాలతో జోరందుకోవాలనుకున్న యాపిల్ ఐఫోన్ 7 పేలిందని వార్త రావడంతో యాపిల్ దిమ్మదిరిగింది. మైండ్ బ్లాస్టైంది. ఐఫోన్ 7 పేలిపోయిందంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ఫ్లాట్ పాం రెడ్డిట్‌లో kroopthesnoop అనే యూజర్ పోస్ట్ చేశారు. ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ వేరియంట్ పేలిపోయిందంటూ కొన్ని ఫోటోలను ఉంచాడు.
 
శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ సమస్య వల్ల పేలిపోతే ఐఫోన్ 7 ప్లస్ రవాణా సమయంలో పేలిపోయిందని తెలిపాడు. అతను ఐఫోన్ బాక్స్ రిసీవ్ చేసుకుని అందులో ఫోన్ ను తెరిచి చూడగా అది ఇలా పేలిపోయిందని తెలిపాడు. దిగ్గజ కంపెనీల ఫోన్లే ఇలా పేలిపోతుంటే ఇక చిన్న కంపెనీల ఫోన్ల సంగతి ఎలా ఉంటుందో అనేది వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడిచిపెడితే చిటికెలో ధ్వంసం చేసి వస్తాం.. పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు : భారత సైనికులు