అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ వ్యాఖ్యలు చేసిన చైనా- మరోసారి నోరు పెంచింది. వాటిని అసంబద్ధమైన, హాస్యాస్పదమైనవంటూ భారత్ తోసిపుచ్చుతున్నప్పటికీ, డ్రాగన్ దేశం మాత్రం నోరు మూయడం లేదు. అరుణాచల్‌ను ఇండియా అన్యాయంగా ఆక్రమించుకొందని మరోసారి నోరు పారేసుకుంది.
అరుణాచల్ ప్రదేశ్ మా అంతర్భాగం అంటూ చైనా పదేపదే ప్రకటనలు చేస్తుండడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చైనా చేస్తున్న ఆరోపణలు నిరాధారం అని స్పష్టం చేసింది.
చైనా వ్యాఖ్యలతో భారత్‌కు వాటిల్లే నష్టమేమీ లేదని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ నుంచి విడదీయరాని, మార్చలేని భాగమని జైస్వాల్ వివరించారు.