Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పారిశుద్ధ్యం కార్మికుల వేషంలో యూట్యూబర్ ఇల్లు ధ్వంసం... ఇంట్లో మలం వేశారు..

Advertiesment
savukku shankar

ఠాగూర్

, బుధవారం, 26 మార్చి 2025 (11:21 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఓ యూట్యూబర్ నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. పారిశుద్ధ్య కార్మికలు వేషంలో వచ్చి ఈ పనికి పాల్పడ్డారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు ఇంట్లో మూత్రం విసర్జన చేశారు. మానవ మలం వేశారు. ఆపై చెత్తాచెదారం వేశారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. 
 
వివిధ రకాలైన రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకునే యూట్యూబర్‌గా చౌకు శంకర్‌కు మంచి పేరుతో పాటు గుర్తింపు ఉంది. గతంలో మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలుచేసినందుకు అరెస్టయి కొంతకాలం జైలులో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మురుగునీటి ట్రక్కుల సేకరణలో కుంభకోణం జరిగిందంటూ శంకర్ ఆరోపణ చేశారు. 
 
దీంతో పారిశుద్ధ్య కార్మికల వేషధారణంలో వచ్చిన 20 మంది మహిళలు, పురుషులు సోమవారం కీల్పాక్కంలోని ఆయన నివాసానికి చేరుకుని ఇంట్లో అక్రమంగా చొరబడి విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో శంకర్ ఇంట్లో లేకపోవడంతో ప్రాణహాని నుంచి తప్పించుకున్నారు. ఆయన తల్లి కమల మాత్రమే ఒంటరిగా ఉన్నారు. తలుపులు తోచుకుని బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన దండుగులు.. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు మానవ మలంతో కూడిన మురుగు నీటిని, చెత్తను ఇంటి ఆవరణలో పడేశారు. వారు వెళ్తూ వెళ్తూ ఇప్పటికి ఇక్కడితో వదిలివేస్తున్నాం.. మరోసారు ఇంట్లో నిన్ను తగలబెట్టేస్తాం అని హెచ్చరించి వెళ్లారు. 
 
కాగా, మురుగునీటి ట్రక్కుల సేకరణలో భారీ స్కామ్ జరిగిందని శంకర్ ఇటీవల తన యూట్యూబ్‌లో ఆరోపించారని, తమ ఇంటిపై దాడికి ఇదే కారణమై ఉంటుందని కమల స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఈ దాడికి సీనియర్ సిటీ పోలీస్ అధికారులో కుట్రపన్నారని శంకర్ ఆరోపించారు. చెన్నై నగర పోలీస్ కమిషనర్ అరుణ్ ఆదేశాల మేరకే తన నివాసంపై దాడి జరిగిందని శంకర్ ఆరోపించారు. ఈ దాడికి సంబంధిచిన సీసీటీవీ ఫుటేజీని ఆయన విడుదల చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rajini: ఎంపీ లావు కృష్ణ దేవ రాయలకు పూర్తి వడ్డీతో తిరిగి చెల్లిస్తాను.. రజనీ స్ట్రాంగ్ వార్నింగ్