మద్యం మత్తుతో సోదరుడి భార్యపైనే లైంగిక దాడి.. ప్రతిఘటించడంతో కత్తితో దాడి.. ఎక్కడ?
మద్యం మత్తుతో ఓ కామాంధుడు సోదరుడి భార్యపైనే కన్నేశాడు. ఆమె ప్రతిఘటించడంతో రెచ్చిపోయాడు. ఆపై కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక ఉత్తర మలయంబాక్కం అంబేద్క
మద్యం మత్తుతో ఓ కామాంధుడు సోదరుడి భార్యపైనే కన్నేశాడు. ఆమె ప్రతిఘటించడంతో రెచ్చిపోయాడు. ఆపై కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక ఉత్తర మలయంబాక్కం అంబేద్కర్ వీధికి చెందిన మదన్ తన భార్య సోనియ(32), 12 ఏళ్ల కుమార్తెతో నివసిస్తున్నారు.
అదే వీధిలో మదన్ పినతండ్రి కుమారుడు అయిన రంజిత్ అప్పుడప్పుడు ఇంటికి వస్తూపోతుంటాడు. మదన్ పనిమీద బయటకు వెళ్తే.. ఆ సమయంలో రంజిత్ మద్యం సేవించి మదన్ ఇంటికి చేరుకున్నాడు. మదన్ ఇంట్లోకి వెళ్లి సోనియాపై లైంగిక దాడికి దిగాడు. దీనికి ఆమె ప్రతిఘటించడంతో కోపం ఊగిపోయిన రంజిత్ సోనియపై కత్తితో దాడి చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంజిత్‌ను అరెస్ట్ చేశారు.