అది బెడ్ రూం కాదు భోషాణం.. 2 గోనె సంచుల్లో బంగారు నగలు.. నయీం పడక గదిలో...
మావోయిస్టు నుంచి మాజీ నక్సలైట్‌గా ఆపై గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీం పడక గదిని కోర్టు అనుమతి మేరకు పోలీసులు తెరిచారు. ఈ గదిని తెరిచిన పోలీసులు నోరెళ్లబెట్టారు.
మావోయిస్టు నుంచి మాజీ నక్సలైట్‌గా ఆపై గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీం పడక గదిని కోర్టు అనుమతి మేరకు పోలీసులు తెరిచారు. ఈ గదిని తెరిచిన పోలీసులు నోరెళ్లబెట్టారు. అది పడక గదిలా లేదు.. ఓ భోషాణంలా ఉంది. 2 గోనె సంచుల్లో సరిపడ బంగారు ఆభరణాలు, వజ్రాలు పొదిగిన బంగారు వాచీలు, చైన్లు, బ్రేస్‌లెట్లు, వెయ్యి డ్రెస్సులు, ఏకే 47, గాయపరచకుండా చంపే సైనైడ్ గన్, 30 విగ్గులు.. 5 మేకప్ కిట్లు, వందల డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు, ఒక శాటిలైట్ ఫోన్ ఇలా ఎన్నో ఆభరణాలు, వస్తువులు లభించాయి.
అత్యంత విశ్వసనీయ వర్గాల మేరకు.. గ్రేటర్ శివారు నెక్నంపూర్‌లో అల్కాపూర్ టౌన్‌షిప్‌లోని నయీం ఇంట్లో వరుసగా మూడో రోజూ పోలీసులు సోదాలు చేశారు. నయీం బెడ్‌రూమ్‌కు తాళం వేసి ఉండటంతో దాన్ని తెరిచేందుకు న్యాయస్థానం అనుమతి తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం తాళాలు తొలగించి సోదాలు చేపట్టారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, నార్సింగి ఇన్‌స్పెక్టర్లు రామచంద్రరావు, చలపతిరావు సిబ్బందితో దాదాపు 9 గంటలపాటు శ్రమించి అందువులో ఉన్న వస్తువులను వెలికి తీశారు.