Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చీకట్లో బిక్కుబిక్కుమంటోన్న చెన్నై పట్టణం.. అమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనవసతి

చెన్నై పట్టణం చీకట్లో బిక్కుబిక్కుమంటోంది. చెన్నై నగరంలోని అనేక చోట్ల సోమవారం ఉదయం నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంధకారం నెలకొంది. తీవ్ర తుపాను ధాటికి భారీ వృక్షాలు విరిగిపడగా.. విద్యుత్ స్తంభాలు

Advertiesment
Chennai braces for impact of cyclone ‘Vardah’
, మంగళవారం, 13 డిశెంబరు 2016 (09:16 IST)
చెన్నై పట్టణం చీకట్లో బిక్కుబిక్కుమంటోంది. చెన్నై నగరంలోని అనేక చోట్ల సోమవారం ఉదయం నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంధకారం నెలకొంది. తీవ్ర తుపాను ధాటికి భారీ వృక్షాలు విరిగిపడగా.. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. తుపాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం అధికంగా ఉంది. గంటకు 140 కి.మీ. వేగంతో వీచిన పెను గాలులకు నగరం చిగురుటాకులా వణికిపోయింది.
 
ఎనిమిది వేల మందికి పైగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి అమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనవసతి కల్పించారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయగా.. ఈ నగరానికి వెళ్ళే అన్ని బస్సు, రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు.
 
మరోవైపు వార్దా తుఫాను ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఇద్దరు మరణించారు. ఈ జిల్లాలో మంగళవారం స్కూళ్ళను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైపై పంజా విసిరిన వార్దా తుఫాను.. 140కి.మీ వేగంతో గాలులు.. నలుగురి మృతి.. చీకటిలో చెన్నై...