Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నైపై పంజా విసిరిన వార్దా తుఫాను.. 140కి.మీ వేగంతో గాలులు.. నలుగురి మృతి.. చీకటిలో చెన్నై...

చెన్నైపై వార్దా తుఫాను పంజా విసిరింది. 140 కిలోమీటర్ల వేగంతో సోమవారం ఉదయం చెన్నై సమీపంలో తమిళనాడు సముద్రతీరాన్ని తాకింది. కొద్ది గంటల పాటు చెన్నై తల్లడిల్లిపోయింది. తుఫాను తీవ్రతకు నలుగురు చనిపోయినట్ల

Advertiesment
Chennai Airport resumes operations; no schools
, మంగళవారం, 13 డిశెంబరు 2016 (09:00 IST)
చెన్నైపై వార్దా తుఫాను పంజా విసిరింది. 140 కిలోమీటర్ల వేగంతో సోమవారం ఉదయం చెన్నై సమీపంలో తమిళనాడు సముద్రతీరాన్ని తాకింది. కొద్ది గంటల పాటు చెన్నై తల్లడిల్లిపోయింది. తుఫాను తీవ్రతకు నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. భారీ గాలుల ఉధృతికి పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగి పడిపోయాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 
 
ఒకవైపు భారీ వర్షం... మరోవైపు రాకాసి గాలుల ప్రభావంతో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ గ్లాస్‌ ప్యానెల్స్‌ ఊడిపోయాయి. రహదారులపై వర్షపు నీరు నిల్చుని రాకపోకలకు అంతరాయం కలిగింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఉధృతి కొనసాగింది. చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశారు. వివిధ ప్రాంతాల నుంచి చెన్నైకి వచ్చే రైళ్లలో కొన్నింటిని దారి మళ్లించారు.
 
దాదాపు 17 రైళ్లను రద్దు చేశారు. చెన్నై నగరంలోని సబర్బన్‌ రైళ్లను మొత్తానికి రద్దు చేశారు. చెన్నైతోపాటు కాంచీపురం, తిరువళ్లూరు లోని అన్ని విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. తుఫాన్‌ తాకిడి కారణంగా 47 గుడిసెలు, 3384 చెట్లు, 3400 విద్యుత్‌ స్తంభాలకు నష్టం జరిగినట్లు జాతీయ విపత్తు నివారణ సంస్థ వెల్లడించింది.
 
వరద పరిస్థితిపై సీఎం పన్నీరు సెల్వం ఎప్పటికప్పుడు సమీక్షించారు. కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సీఎం సెల్వంకు ఫోన్‌ చేశారు. అవసరమైన సహాయాన్నంతా అందిస్తామని భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యల కోసం నావికా, వైమానిక దళాలు ఆహారం, నీరు, డాక్టర్స్‌ తో రెడీగా ఉన్నాయి.
 
వార్ధా తీరం దాటకముందే ముందస్తు చర్యల్లో భాగంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌‌లో 16 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వార్ధా ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తక్కువగానే ఉంది. నెల్లూరు, చిత్తూరు జిల్ల్లాల్లో మాత్రమే తుఫాన్‌ ప్రభావం కనిపించింది. గాలి ఉధృతికి సుళ్లూరుపేట వద్ద ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ తిరగబడిపోయింది.
 
రేణిగుంట విమానాశ్రయంలో పైకప్పు రేకులు కదిలాయి. గూడురు, చెన్న్తె మధ్య రైల్వే ట్రాక్‌ దెబ్బతినడంతో రైళ్లను రద్దు చేశారు. ఇక మంగళవారం నాడు తుఫాన్‌ కర్నాటక మీదుగా గోవాకు దక్షిణంగా తరలిపోతుందని అధికారులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయ చికిత్స ఖర్చు ఎవరు భరిస్తారో తెలీదు.. ఆమెను బాధపెట్టాను.. అయినా పెద్దకూతురి పెళ్ళికొచ్చారు.. రజనీ