Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడో తెలుసా? (Video)

చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడో తెలుసా? (Video)
, గురువారం, 14 నవంబరు 2019 (15:31 IST)
చంద్రయాన్-2 ఆచూకీ తెలియరాకపోవడంతో ఇస్రో.. మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా చంద్రయాన్-3 కోసం ప్రణాళికలు రూపొందించనుంది. 2020 నవంబర్ నెలలో ఇస్రో చంద్రయాన్‌-3ని నింగిలోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 
చంద్రుని దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకు గాను పంపబడిన చంద్రయాన్-2, విక్రమ్ ల్యాండర్ చంద్రునికి పై భాగంలో దిగింది. కానీ చంద్రునికి 2.1 కిలోమీటర్ల దూరంలోనే సిగ్నల్ అందలేదు.  రెండు నెలల క్రితం చంద్రుడిపైకి ఇస్రో పంపిన ఈ చంద్రయాన్-2 మిషన్ ప్రయోగం విఫలమవడంతో.. మళ్లీ చంద్రుడిపైకి మరో మిషన్‌ను ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది.
 
సోమనాథ్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చే నివేదిక కోసం ఇస్రో ఎదురుచూస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే కమిటీకి కొన్ని సూచనలు చేసినట్లు చెప్పిన అధికారి ఆ సూచనలకు అనుగుణంగా నివేదిక తయారు చేస్తుందని అధికారి తెలిపారు. వచ్చే ఏడాది నవంబర్‌లో చంద్రయాన్ -3ని ప్రయోగిస్తామని వెల్లడించారు. ఈ సారి అంటే చంద్రయాన్-3లో రోవర్‌, ల్యాండర్‌పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తామని అధికారి వెల్లడించారు.
 
ల్యాండింగ్ సమయంలో మళ్లీ తప్పులు పునరావృతం కాకుండా సాఫ్ట్ ల్యాండింగ్‌కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటినీ తీసుకుంటామని చెప్పారు. చంద్రయాన్-2లో జరిగిన అతి చిన్న తప్పులను సైతం కరెక్ట్ చేసుకుని పక్కాగా అమలు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడుతరాలను కబళించిన డెంగీ భూతం.. ఎక్కడ?