శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది అన్న నానుడికి నిదర్శనంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన దివ్యాంశి జైన్(18)అనే విద్యార్థిని సీబీఎస్ఈ పరీక్షలో 600కు 600 మార్కులు సాధించింది. తాజాగా 2020 జులై 13న విడుదలైన 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో దివ్యాంశి జైన్ వందశాతం మార్కులు సాధించింది.
దీంతో ఆమె తల్లిదండ్రులు ఆనందంలో మునిగారు. అయితే ఆర్ట్స్ విభాగంలో ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి అని విద్యావేత్తలు అంటున్నారు. ఈ సందర్భంగా దివ్యాంశి జైన్ మాట్లాడతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, టీచర్ల మార్గదర్శకం వల్లే ఈ ఘనత సాధ్యమైందని వెల్లడించారు.