చిదంబర రహస్యం గుట్టురట్టుపై సీబీఐ గురి : కావాలనే టార్గెట్ చేశారంటున్న చిదంబరం
కేంద్ర ఆర్థికమాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం నివాసంలో సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆయనతో పాటు.. ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇంట్లోనూ సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. అలాగే తమి
కేంద్ర ఆర్థిక మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం నివాసంలో సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆయనతో పాటు.. ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇంట్లోనూ సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. అలాగే తమిళనాడు వ్యాప్తంగా 14 ప్రాంతాలతో పాటు ఢిల్లీ, నోయిడాలోనూ సీఐబీ ఏకకాలంలో మంగళవారం ఈ దాడులు నిర్వహించింది.
విదేశీ పెట్టుబడులు తీసుకునేందుకు ఓ మీడియా గ్రూపునకు లంచం తీసుకుని అనుమతులు ఇప్పించినట్లు కార్తీ చిదంబరం సంస్థ ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా... కుమార్తె హత్య కేసులో జైలుజీవితం గడుపుతున్న స్టార్ ఇండియా మాజీ సీఈఓ భార్య ఇంద్రాణి ముఖర్జీయాకు చెందిన ఐఎన్‌ఎక్స్ మీడియాకు 2008లో దొడ్డిదారిలో అనుమతులు మంజూరుచేయించినట్టు కార్తీపై ఆరోపణలున్నాయి.
అలాగే, ఎయిర్‌సెల్, మ్యాక్సిస్ ఒప్పందాల వ్యవహారం కేసులో కార్తీ చిదంబరంపై ఆదాయపన్ను శాఖ, ఈడీ వర్గాలు దాడులు నిర్వహించింది. ఇదేవిధంగా రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 108 అంబులెన్స్ సేవల్లో చోటుచేసుకున్న అవినీతిలో కార్తీ చిదంబరానికి వాటా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చిదంబరం, కార్తీ చిదంబరం నివాసాల్లో సోదాలు చేయడం గమనార్హం.
ఈ సోదాలపై చిదంబరం స్పందిస్తూ... కేంద్ర ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, కేవలం రాజకీయ కక్షతోనే తనపై సీబీఐతో దాడులు చేయించిందని ఆరోపించారు. 'నా కుమారుడు, అతని మిత్రులను లక్ష్యంగా చేసుకుని సీబీఐ, ఇతర ఏజెన్సీలతో కేంద్రం దాడులు చేయిస్తోంది. నా గొంతు నొక్కేందుకు, ఎలాంటి రాతలు రాయకుండా నిరోధించేందుకే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోంది. విపక్ష నేతలు, పాత్రికేయులు, కాలమిస్టులు, ఎన్జీఓలు, పౌర సంస్థల గొంతునొక్కుతున్న రీతిలోనే నా పట్లా వ్యవహరిస్తోంది. ఒక్కటి మాత్రం చెప్పదలచుకున్నాను. ఏం చేసినా నన్ను మాట్లాడనీయకుండా, రాయనీయకుండా చేయలేరు' అని అన్నారు.