Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగళూరులో కావేరి మంటలు.. 250 బస్సులు దగ్ధం... 16 ప్రాంతాల్లో కొనసాగుతున్న కర్ఫ్యూ..

కావేరీ జలవివాదంతో అట్టుడుకుతున్న కర్ణాటక అట్టుడుకి పోతోంది. ఆ రాష్ట్ర రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ నబంర్ కలిగిన వాహనాలకు నిప్పంటిస్

Advertiesment
బెంగళూరులో కావేరి మంటలు.. 250 బస్సులు దగ్ధం... 16 ప్రాంతాల్లో కొనసాగుతున్న కర్ఫ్యూ..
, మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (11:21 IST)
కావేరీ జలవివాదంతో అట్టుడుకుతున్న కర్ణాటక అట్టుడుకి పోతోంది. ఆ రాష్ట్ర రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ నబంర్ కలిగిన వాహనాలకు నిప్పంటిస్తున్నారు. ఇప్పటికే 250 బస్సులకు నిప్పంటించారు. దీంతో 16 ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. 
 
యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు. నిన్న ఒక్కరోజే ఆందోళనకారులు వంద వాహనాలను తగలబెట్టారు. ఆందోళనను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. దీంతో నగరంలో అప్రకటిత బంద్ కొనసాగుతోంది. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాండ్యాలో ఈనెల 17 వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. 
 
కర్ణాటక పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. పది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కర్ణాటకకు పంపించింది. జలవివాదంపై చర్చించేందుకు కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశం అవుతోంది. తమిళుల ప్రాణాలు, ఆస్తులు కాపాడాలంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా పౌరులను తక్షణం రాష్ట్రానికి పంపించండి : కేంద్రానికి కేరళ వినతి