మా పౌరులను తక్షణం రాష్ట్రానికి పంపించండి : కేంద్రానికి కేరళ వినతి
బెంగళూరులో చిక్కుకుపోయిన తమ రాష్ట్ర పౌరులు క్షేమంగా వెనక్కి వచ్చేందుకు వీలుగా రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
బెంగళూరులో చిక్కుకుపోయిన తమ రాష్ట్ర పౌరులు క్షేమంగా వెనక్కి వచ్చేందుకు వీలుగా రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తమిళనాడుకు కావేరీ జలాలను తప్పనిసరిగా విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో సోమవారం కర్ణాటక వ్యాప్తంగా ఆందోళన కారులు రెచ్చిపోయి హింసాత్మక చర్యలకు దిగిన విషయంతెలిసిందే.
అయితే, కేరళ రాష్ట్రానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో బెంగళూరులో ఉపాధి పొందుతున్నారు. ఓనం పండుగ నేపథ్యంలో స్వరాష్ట్రానికి వెళ్లాల్సిన వారు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారందరూ అక్కడి నుంచి స్వరాష్ట్రానికి క్షేమంగా చేరుకునేందుకు వీలుగా రెండు రైళ్లను ఏర్పాటు చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం రాత్రి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు.