Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్కూటీకి కుక్కను తాళ్లతో కట్టి.. ఈడ్చుకెళ్లిన యువతులు..

స్కూటీకి కుక్కను తాళ్లతో కట్టి.. ఈడ్చుకెళ్లిన యువతులు..
, బుధవారం, 30 జూన్ 2021 (10:25 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్ర రాజధాని చండీఘడ్‌, పాటియాలకు ఇద్దరు యువతులు తమ స్కూటీకి కుక్కను తాళ్లతో కట్టేసి ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ఆ ఇద్దరు యువతులపై కేసు నమోదైంది. 
 
పంజాబ్‌కు చెందిన ఈ మహిళలు ఒక కుక్కను తమ స్కూటీకి కట్టేసి లాక్కెళ్లారు. ఈ ఘటన రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. విషయం తెలుసుకున్న పంజాబ్ పోలీసులు సదరు యువతులు ఇద్దరినీ అరెస్టు చేశారు. 
 
ఆపై కాసేపటికే వాళ్లిద్దరినీ వదిలేశారు. ఈ కుక్కను ఎవరో పెంచకునే వారని, అయితే కొంతకాలం క్రితం దీనికి పిచ్చెక్కిందని ఆ యువతులు ఆరోపించారు. అయితే, నెటిజెన్లు మాత్రం ఆ యువతులపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిజ్జా డ్రోన్లతో దాడులు జరుపుతారా?