మైనర్ భార్య ఇష్టంతో చేసే సెక్స్ నేరమా? కాదా? సుప్రీం ఏమంటోంది?
మైనర్ భార్య ఇష్టంతో చేసే సెక్స్ నేరమా కాదా అనే అంశంపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 15 నుంచి 18 యేళ్లలోపు వయస్సు భార్యతో సెక్స్ నేరం కాదని ఐపీసీ 375 సెక్షన్ చెబుతోంది. అలాగే, 18 య
మైనర్ భార్య ఇష్టంతో చేసే సెక్స్ నేరమా కాదా అనే అంశంపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 15 నుంచి 18 యేళ్లలోపు వయస్సు భార్యతో సెక్స్ నేరం కాదని ఐపీసీ 375 సెక్షన్ చెబుతోంది. అలాగే, 18 యేళ్లలోపు బాలికతో బలవంతపు సెక్స్ చేస్తే పదేళ్ల వరకు శిక్ష పడేంతటి తీవ్రమైన నేరమని ‘లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ(పోక్సో) చట్టం’ చెబుతోందని గుర్తు చేసింది.
అంటే ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉందని, దాన్ని సరిదిద్దాలని కోరుతూ నోబెల్ గ్రహీత, ‘బచ్‌పన్ బచావ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కైలాశ్ సత్యార్థి వేసిన ప్రజాహిత వ్యాజ్యంతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. దీనిని కేంద్రం పరిశీలించి 4 నెలల్లో తన వాదనను సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్.ఖేహార్, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.
అంతేకాకుండా, ఇద్దరు మేజర్లు తదనంతర పరిణామాలపై పూర్తి అవగాహన ఉండి ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధం పెట్టుకుంటే అత్యాచారం కిందకు రాదని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. వివాహానికి నిరాకరించిన మాజీ ప్రియుడిపై మహిళా ప్రొఫెసర్ పెట్టిన రేప్ కేసును కొట్టేసింది.