సినీ నటుడు కృష్ణంరాజుకు బంపర్ ఆఫర్... తమిళనాడు గవర్నర్‌గా ఛాన్స్?
సినీ నటుడు కృష్ణంరాజుకు రొట్టె విరిగి నేతిలో పడినట్లే మీడియాలో వస్తున్న వార్తలు నిజమైతే. ఇంతకీ విషయం ఏమిటంటే... బీజేపీ సీనియర్ నాయకుడు, సినీ నటుడు కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రకు గవర్నర్‌గా బా
సినీ నటుడు కృష్ణంరాజుకు రొట్టె విరిగి నేతిలో పడినట్లే మీడియాలో వస్తున్న వార్తలు నిజమైతే. ఇంతకీ విషయం ఏమిటంటే... బీజేపీ సీనియర్ నాయకుడు, సినీ నటుడు కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రకు గవర్నర్‌గా బాధ్యతలు వహిస్తున్న విద్యాసాగర్ రావు తమిళనాడు తాత్కాలిక గవర్నరుగా బాధ్యతలు వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో తమిళనాడుకు కృష్ణంరాజు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు రోశయ్య గవర్నరుగా పని చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడులో ఏర్పడిన ప్రత్యేక రాజకీయాల నేపధ్యంలో కృష్ణంరాజు అయితేనే కరెక్ట్ అనే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బాహుబలి విజయవంతమైనప్పుడు హీరో ప్రభాస్ ను వెంటబెట్టుకుని కృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.