Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరేళ్ల చిన్నారిపై 50ఏళ్ల మహిళ బెత్తం దాడి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ (Video)

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆహారం తీసుకుంటుండగా కింద రాల్చిందనే కారణంతో ఆరేళ్ల చిన్నారిని 50 ఏళ్ల తమిళ మహిళ బెత్తంతో వాయించేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆహారం కింద రాలి

Advertiesment
ఆరేళ్ల చిన్నారిపై 50ఏళ్ల మహిళ బెత్తం దాడి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ (Video)
, మంగళవారం, 6 జూన్ 2017 (16:36 IST)
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆహారం తీసుకుంటుండగా కింద రాల్చిందనే కారణంతో ఆరేళ్ల చిన్నారిని 50 ఏళ్ల తమిళ మహిళ బెత్తంతో వాయించేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆహారం కింద రాలిందనే కారణంతో చిన్నారిని అమానుషంగా కొట్టడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ చిన్నారికి తల్లిదండ్రులు లేరని సమాచారం. 
 
అలాగే 50 ఏళ్ల మహిళ అమానుషంగా బెత్తంతో కొట్టడాన్ని మరో మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియోను చాలామంది షేర్ చేసుకున్నారు. తద్వారా నెటిజన్లు ఆ చిన్నారి వైపు నిలిచారు. ఈ వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారిపై దాడి చేసిన మహిళను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను మీరూ చూడండి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓమలూరులో నిర్భయ తరహా ఘటన.. తల్లిదండ్రులపై అలిగింది.. గ్యాంగ్‌రేప్‌కు గురైంది..