Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓమలూరులో నిర్భయ తరహా ఘటన.. తల్లిదండ్రులపై అలిగింది.. గ్యాంగ్‌రేప్‌కు గురైంది..

నిర్భయ తరహా ఘటన ఓమలూరులో చోటుచేసుకుంది. 15 ఏళ్ల చిన్నారిని బస్సులోనే ముగ్గురు డ్రైవర్లు రేప్ చేశారు. ఈ ఘటన తమిళ రాష్ట్రం సేలం జిల్లాలోని ఓమలూరులో జరిగింది. ఢిల్లీలో కదిలే బస్సులో నిర్భయ అనే యువతిని ఓ

Advertiesment
ఓమలూరులో నిర్భయ తరహా ఘటన.. తల్లిదండ్రులపై అలిగింది.. గ్యాంగ్‌రేప్‌కు గురైంది..
, మంగళవారం, 6 జూన్ 2017 (16:26 IST)
నిర్భయ తరహా ఘటన ఓమలూరులో చోటుచేసుకుంది. 15 ఏళ్ల చిన్నారిని బస్సులోనే ముగ్గురు డ్రైవర్లు రేప్ చేశారు. ఈ ఘటన తమిళ రాష్ట్రం సేలం జిల్లాలోని ఓమలూరులో జరిగింది. ఢిల్లీలో కదిలే బస్సులో నిర్భయ అనే యువతిని ఓ గ్యాంగ్ అమానుషంగా దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో నిర్భయ ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో నిర్భయ తరహా ఘటన తమిళనాడులో సంభవించింది. 
 
వివరాల్లోకి వెళితే.. సేలం నుంచి ఓమలూరుకు సమీపంలో నర్ణంపాళెం అనే గ్రామంలో ఓ ప్రైవేట్ బస్సు సర్వీస్ నడుస్తోంది. రాత్రి పది గంటలకు తర్వాత ఆ బస్సు నుంచి 15ఏళ్ల చిన్నారి భయపడుతూ, కేకలు పెట్టుకుంటూ బయటికి వచ్చింది. స్థానికులు బాలిక వద్ద ఆరా తీయగా.. బస్సులో ముగ్గురు తనపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు తెలిపింది. దీంతో ఆ ముగ్గురిని పట్టుకున్న పోలీసులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పదో తరగతి చదువుతున్న ఆ బాలిక తల్లిదండ్రులపై అలిగి సేలం వెళ్లినట్లు.. అక్కడ నుంచి నర్ణంపాళెం బస్సు ఎక్కేసినట్లు తెలిసింది. ఆ బాలికను పలకరించి విషయం తెలుసుకున్న డ్రైవర్ బస్సులోనే కూర్చోమని నర్ణంపాళెం రాగానే.. రాత్రి పది గంటలకు పైగా మరో ఇద్దరు డ్రైవర్లతో కలిసి రేప్ చేసినట్లు విచారణలో తేలింది. బాలిక ప్రతిఘటించడంతో నోట్లో దుస్తులు కుక్కి ఒకరి తర్వాత ఒకరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులతో బాలిక వాపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమ సంబంధం... భార్యను ముక్కలు ముక్కలుగా చేసి... ఆ తరువాత?(Video)