Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రాణం తీసిన ఆవు పేడ... జర్నలిస్టు సోదరుడి హత్య

Advertiesment
ప్రాణం తీసిన ఆవు పేడ... జర్నలిస్టు సోదరుడి హత్య
, సోమవారం, 19 ఆగస్టు 2019 (14:15 IST)
యూపీలో దారుణం జరిగింది. చిన్న వివాదం ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఆవు పేడపై గొడవ ఇద్దరి హత్యకు దారితీసింది. జర్నలిస్ట్‌ని అతడి సోదరుడిని కాల్చి చంపాడు. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళితే.. కొత్వాలీ ప్రాంతానికి చెందిన మహీపాల్‌‌కి డైరీ ఫామ్ ఉంది. అదే ప్రాంతంలో ఆశిష్ అనే వ్యక్తి తన సోదరుడు ఆశుతోష్ తో నివాసం ఉంటున్నాడు. ఆశిష్ జర్నలిస్ట్. 
 
డైరీ ఫాంలోని పేడను అక్కడ పనిచేసేవారు ఆశిష్ ఇంటి ముందు డంప్ చేస్తున్నారు. దీనిపై ఆశిష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇంటి ముందు పేడ వేయొద్దని పలుమార్లు చెప్పాడు. అయినా వారు వినిపించుకోలేదు. దీంతో ఈ విషయంపై మహిపాల్‌తో ఆశిష్, ఆశుతోష్‌లు గొడవకు దిగారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన మహిపాల్ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. 
 
అన్నదమ్ముల ఇంట్లోకి వెళ్లి గన్ తో వారిద్దరిని కాల్చి చంపాడు. చిన్న వివాదం ప్రాణం తీసే వరకు వెళ్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. అన్నదమ్ముల మృతితో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. ఆశిష్ కుటుంబసభ్యులు షాక్‌లో ఉన్నారు. దీనిపై ఏకంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. 
 
మృతుల కుటుంబ సభ్యులకు రూ. 5లక్షల చొప్పున్న నష్ట పరిహారం ప్రకటించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. మహిపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిపాల్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని డీఐజీ తెలిపారు. జర్నలిస్ట్, అతడి సోదరుడి హత్యతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. 
 
పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. ఆవు పేడ డంపింగ్ విషయమై ఆశిష్ పలుమార్లు పోలసులకు ఫిర్యాదు చేశాడని, పోలీసులు మాత్రం పట్టించుకోలేదని వాపోయారు. పోలీసులు స్పందించి ఉంటే.. ఇవాళ ఇంత దారుణం జరిగి ఉండేది కాదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెజాన్: "డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - 'ఫే‌క్' అంబాసిడర్లపై ట్విటర్‌లో విమర్శలు