Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రసగుల్ల కోసం కొట్టుకున్న వధూవరుల కుటుంబాలు, పెళ్లి క్యాన్సిల్ (video)

Advertiesment
Rasagulla

ఐవీఆర్

, శనివారం, 6 డిశెంబరు 2025 (14:23 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
బీహారులో రసగుల్ల కోసం పెళ్లి రద్దు అయ్యింది. వివాహానికి ముందు జరిగే రిసెప్షన్లో వధువు తరపు బంధువులు విందును ఆరగించేందుకు వచ్చారు. వరుడు తరుపువారు విందు ఏర్పాటు చేసారు. ఐతే ఆ విందులో వధువు తరపువారు చెప్పిన రసగుల్ల లేదు. దాంతో కొంతమంది భోజనం వడ్డించేవారి వద్దకు వచ్చి రసగుల్ల ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
 
దాంతో మాటామాటా పెరిగి గొడవపడ్డారు. ఆ గొడవ కాస్తా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు, ప్లేట్లు విసురుకునే స్థాయికి వెళ్లిపోయింది. ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రసగుల్ల కోసం ఇంత రచ్చ చేసిన వరుడు కుటుంబంతో సంబంధం తమకు ఇష్టం లేదని వధువు తరుపువారు పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nara Lokesh: డిసెంబర్ 6-10 వరకు అమెరికా, కెనడాలో నారా లోకేష్ పర్యటన