దేశం కోసం చనిపోతే.. కంటతడి పెట్టొద్దని చెప్పాడు.. గుర్నామ్ సింగ్ తల్లి
సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన బీఎస్ఎఫ్ జవాను గుర్నామ్ సింగ్ కన్నుమూశాడు. తన కుమారుడిని బతికించాలని కేంద్ర పాలకులను ఆ కుటుంబం వే
సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన బీఎస్ఎఫ్ జవాను గుర్నామ్ సింగ్ కన్నుమూశాడు. తన కుమారుడిని బతికించాలని కేంద్ర పాలకులను ఆ కుటుంబం వేడుకుంది. అంతలోనే ఆ జవాను కన్నుమూశాడు.
అయితే, చెట్టంత కొడుకు చనిపోయి.. కడుపుకోత మిగిల్చినా గుర్నామ్ సింగ్ తల్లి ప్రదర్శించిన గాంభీర్యం, ఆమె దేశభక్తి అనితర సాధ్యమే. 'నేను దేశం కోసం చనిపోతే ఎవరూ కంటతడి పెట్టవద్దు' అని తల్లికి ముందే చెప్పాడంటే ఆ జవాను త్యాగనిరత అసామాన్యం.
పాక్ రేంజర్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి... చికిత్సపొందుతూ కన్నుమూసిన బీఎస్ఎఫ్ జవాన్ గుర్నమ్ సింగ్ అయితే, కొడుకు మాటను తూచా తప్పకుండా పాటించి పుట్టెడు శోఖాన్ని కడుపులోనే దాచుకుంది గుర్నామ్ తల్లి జశ్వంత్ కౌర్.
ఒకవైపు జవాన్లంతా గుర్నామ్ మరణంతో శోఖసంద్రంలో మునిగిపోగా ఆయన తల్లి తన కొడుకు మాటలను ఆదివారం గుర్తు చేసుకుంది. దేశ రక్షణలో ప్రాణాలు పోతే బాధపడవద్దని తన కొడుకు చెప్పాడని, అందుకే తాను ఏడవటం లేదని జశ్వంత్ కౌర్ అన్నారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన జవాన్లను చూసి తాను ఎంతో గర్విస్తున్నానని ఆమె చెప్పారు.