Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా జోలికొస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు.. పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్

మా జోలికి వస్తే తగిన శాస్తి తప్పదని పాకిస్థాన్‌కు భారత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ యధేచ్చగా ఉల్లంఘించి క

Advertiesment
మా జోలికొస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు.. పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్
, ఆదివారం, 23 అక్టోబరు 2016 (17:07 IST)
మా జోలికి వస్తే తగిన శాస్తి తప్పదని పాకిస్థాన్‌కు భారత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ యధేచ్చగా ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీనిపై భారత్ సైన్యం ఆదివారం తీవ్రంగా హెచ్చరించింది. 
 
తమ సైనికులను కనీసం తాకాలని ప్రయత్నించినా పాక్‌ తీవ్ర మూల్యం చెల్లించుకోకతప్పదని తేల్చిచెప్పింది. గత శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లోని హీరానగర్‌ సెక్టర్‌లో బీఎస్‌ఎఫ్‌ జవాను గుర్నామ్‌ సింగ్‌ను పాక్‌ సైన్యం కవ్వింపు కాల్పుల్లో గాయపడి మృతి చెందడంతో ప్రతీకారంగా బీఎస్‌ఎఫ్‌ జవాన్లు తీవ్రస్థాయిలో కాల్పులు జరిపి ఏడుగురు పాక్‌ రేంజర్లను హతమార్చిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు.. పాక్‌ సైన్యం మొదట జరిపిన ఏకపక్ష కాల్పుల్లో గాయపడిన గుర్నామ్‌ సింగ్‌ రెండురోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచారు. ఆయన భౌతికకాయానికి జమ్ములోని బీఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయంలో బీఎస్‌ఎఫ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ సైనిక లాంఛనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గత 24 గంటలుగా సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొని ఉంది. కానీ ఈ  శాంతియుత వాతావరణం ఏ సమయంలోనైనా భగ్నం కావొచ్చు. అందుకు మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్యే పదవి అంటే సినిమా షూటింగ్ కాదు.. బాలయ్యపై వైకాపా నేత సెటైర్లు