Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ-సిగిరెట్ ఉంచుకున్నందుకు తప్పిన విమానయోగం.. ఇలా కూడా దింపేస్తారా?

బస్సు, రైలు ప్రయాణాల్లో ప్యాసింజర్లదే హవా అని మనందరికీ తెలుసు. కండక్టర్, టికెట్ కలెక్టర్ ఎవరైనా సరే ప్యాసింజర్లను ఏమీ చేయలేరు. ఈ బస్సు నాదే, ఈ రైలు నాదే అని పాడుకుంటూ రైలు, బస్సులను పాడు చేసుకుంటూ పోతుంటాము. కాని విమానంలో తిక్కవేషాలు వేస్తే మరుక్షణం

Advertiesment
ఈ-సిగిరెట్ ఉంచుకున్నందుకు తప్పిన విమానయోగం.. ఇలా కూడా దింపేస్తారా?
హైదరాబాద్ , శనివారం, 6 మే 2017 (02:38 IST)
బస్సు, రైలు ప్రయాణాల్లో ప్యాసింజర్లదే హవా అని మనందరికీ తెలుసు. కండక్టర్, టికెట్ కలెక్టర్ ఎవరైనా సరే ప్యాసింజర్లను ఏమీ చేయలేరు. ఈ బస్సు నాదే, ఈ రైలు నాదే అని పాడుకుంటూ రైలు, బస్సులను పాడు చేసుకుంటూ పోతుంటాము. కాని విమానంలో తిక్కవేషాలు వేస్తే మరుక్షణం విమానం ఎలివేటర్ కింద ఉంటారు. చిన్ని తప్పు జరిగినా, అసహనం ప్రదర్శించినా విమానయాన సంస్థ మీపై సీరియస్‌గా చర్య తీసుకుంటుంది. చర్య అంటే పోలీసులకు అప్పగించటం అని కాదు. విమానం నుంచి ఉన్నఫళాన మిమ్మల్ని దింపేస్తారు అంతే. 
 
బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్ సోదరుడు ముకుల్ దేవ్‌ను ఇటీవలే అలా విమానం నుంచి దింపేశారట. కారణం తన బ్యాగులో విరిగిపోయిన ఈ సిగిరెట్ ఉందట. విరిగిపోయిన ఈ సిగిరెట్ బ్యాగులో ఉంచుకుంటే కూడా నేరమేనని పాపం తనకు తెలీదు. ఎంత గింజుకున్నా, తన తప్పేమీ లేదని మొత్తుకున్నా విమానయాన సంస్ధ కరుణించలేదు. 
 
వివరాల్లోకి పోతే... అమృత్‌సర్‌ వెళ్లేందుకు ముకుల్‌ దేవ్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాన్ని ఎక్కారు. చెకింగ్‌లో భాగంగా ఆయన బ్యాగును పరిశీలించగా విరిగిపోయిన ఈ సిగరెట్‌ కనిపించింది. టేకాఫ్‌ అయ్యే ఐదు నిమిషాల ముందు విమానం నుంచి తనని దింపేసినట్లు ఆయన తెలిపారు. విమానాశ్రయ సిబ్బందికి ఎంత నచ్చజెప్పాలని చూసినా లాభం లేకుండా పోయిందన్నారు.ముకుల్‌ దేవ్‌ పలు హిందీ, తెలుగు సినిమాల్లో నటించారు. నాగచైతన్య నటించిన ‘బెజవాడ’, రవితేజ నటించిన ‘కృష్ణ’ తదితర సినిమాల్లో కనిపించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్ గింజుకు చచ్చినా ఐటీ బూమ్ కేంద్రంగా ఇండియాదే హవా.. ఇన్పీ మాజీ సీఈవో