ట్రంప్ గింజుకు చచ్చినా ఐటీ బూమ్ కేంద్రంగా ఇండియాదే హవా.. ఇన్పీ మాజీ సీఈవో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత గింజుకులాడినా మరో 30 సంవత్సరాలు ఐటీ బూమ్ భారత్‌లో కొనసాగుతుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో క్రిస్ గోపాలకృష్ణన్ తేల్చి చెప్పారు. హెల్త్‌కేర్, ఆటోమొబైల్ వంటి రంగాలు వచ్చే మూడు దశాబ్దాలు మరింత ఉత్తేజ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత గింజుకులాడినా మరో 30 సంవత్సరాలు ఐటీ బూమ్ భారత్‌లో కొనసాగుతుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో క్రిస్ గోపాలకృష్ణన్ తేల్చి చెప్పారు. హెల్త్‌కేర్, ఆటోమొబైల్ వంటి రంగాలు వచ్చే మూడు దశాబ్దాలు మరింత ఉత్తేజకరంగా ఉంటాయి. ప్రతి పరిశ్రమతోపాటు మన జీవితంలో అన్నింటికీ ఐటీని వినియోగిస్తుండడం ఈ బూమ్‌కి కారణం. సమూల మార్పులకు వాహన రంగం వేదిక కానుంది. స్వయం చోదక కార్లు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించే వాహనాల వంటి ఎన్నో ఆవిష్కరణలు నమోదుకానున్నాయి’ అని తెలిపారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ రంగంలో ప్రవేశించేందుకు సరైన తరుణమిదే అంటూ సాఫ్ట్ వేర్ సంక్షోభం గురించి భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు.
తాను ఒక పాత్ర పోషించి స్థాపించిన ఇన్ఫోసిస్ మాజీ సీఈవో క్రిస్ గోపాలకృష్ణన్ వృత్తిపరంగా సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా కంపెనీతో తనకు మానసిక అనుబంధం ఉందని పేర్కొన్నారు. జీవిత కాలాన్ని పణంగాపెట్టి నిర్మించిన సంస్థ నుంచి మానసికంగా బయటకు రాలేమని అన్నారు. అయితే అన్నిటికీ సిద్ధంగా ఉండాలని, తాము రెండో ఇన్నింగ్స్ ప్రారంభించామని గుర్తుచేశారు. కంపెనీతో మానసిక బంధం ఎన్నటికీ తెగదని చెప్పారు.